Corona : కరోనా ఉగ్రరూపం, ఆగస్టు 30 నుంచి నైట్ కర్ఫ్యూ

కేరళ రాష్ట్రంలో కొత్త కేసులు 30 వేల పైగా నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1,67,497 శాంపిల్స్ పరీక్షిస్తే...31 వేల 265 కొత్త కేసులు రికార్డయ్యాయి.

Corona : కరోనా ఉగ్రరూపం, ఆగస్టు 30 నుంచి నైట్ కర్ఫ్యూ

Kerala

Updated On : August 29, 2021 / 6:48 AM IST

Night Curfew : భారతదేశంలో కరోనా పంజా విసురుతూనే ఉంది. తొలుత తగ్గుముఖం పట్టిన కేసులు..ఇప్పుడు మరింతగా పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతి రోజు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదే విధంగా ఉంది. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. ప్రధానంగా కేరళ రాష్ట్రంలో కేసుల సంఖ్య అధికంగా నమోదవుతోంది.

Read More : Guntur : ఒక్కడే వచ్చాడు..తల్లీ కూతుళ్లను పొడిచి పొడిచి చంపేశాడు

కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఒక్కరోజే 46 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 509 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో నమోదవుతున్న కేసులు భీతిగొల్పేలా ఉన్నాయి. కేరళలో 32,801 కేసులు వెలుగుచూడగా…179 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మూడో ముప్పు కేరళతోనే మొదలవుతుందన్న భయం ఆవహించింది.

Read More : Jio vs Airtel.. టెలికం రంగంలోకి గూగుల్‌ ఎంట్రీ?

మొత్తం కేసుల్లో దాదాపు సగానికి పైగా ఇక్కడే వెలుగు చూస్తుండడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలకు మళ్లీ దిగుతోంది. రాత్రి వేళ కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 30వ తేదీ నుంచి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని, ఇది రాష్ట్రమంతటికీ వర్తిస్తుందని సీఎం పినరయి విజయన్ ప్రకటించారు.

Read More : సెప్టెంబర్ 1 నుంచి కేజీ టు పీజీ విద్యా సంస్థలు రీఓపెన్

శనివారం కూడా కేరళ రాష్ట్రంలో కొత్త కేసులు 30 వేల పైగా నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1,67,497 శాంపిల్స్ పరీక్షిస్తే…31 వేల 265 కొత్త కేసులు రికార్డయ్యాయి. 153 మంది వైరస్ తో చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్త కేసులతో కలిపితే..రాష్ట్రంలో 39.77 లక్షలకు చేరువయ్యాయి. మరణాల సంఖ్య 20 వేల 466 నమోదయ్యాయి. అయితే..శుక్రవారంతో పోలిస్తే…పాజిటివిటీ రేటు 19.22 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 18.67గా ఉంది. ఇప్పటి వరకు కేరళ రాష్ట్రంలో 37.51 లక్షల మంది కోలుకున్నారు.