kerala school : కొత్త అడ్మిషన్ల కోసం కేరళ స్కూల్‌ కొత్త కాన్సెప్ట్ అదిరిందిగా..

ఏ వ్యాపారం అయినా కొత్తగా ప్రమోట్ చేసుకోకపోతే ఎక్కువ కాలం నిలబడదు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా పేరెంట్స్ పిల్లల్ని తమ స్కూళ్లలో జాయిన్ చేసేందుకు కాస్త క్రియేటివ్ గా ఆలోచించి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కేరళలో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఎలా ప్రమోట్ చేస్తోందో చూస్తే ఆశ్చర్యపోతారు.

kerala school : కొత్త అడ్మిషన్ల కోసం కేరళ స్కూల్‌ కొత్త కాన్సెప్ట్ అదిరిందిగా..

kerala school new concept

Updated On : April 14, 2023 / 3:01 PM IST

kerala school new concept :  చాలా స్కూళ్లలో పిల్లలకి ఫైనల్ పరీక్షలు అయిపోయాయి. కొన్ని స్కూళ్లలో కొత్త అడ్మిషన్లు (admission) కూడా మొదలైపోయాయి. ఇక తమ స్కూళ్లలో పిల్లలను చేర్పించడానికి స్కూలు యాజమాన్యాలు రకరకాల కాన్సెప్ట్‌లతో కసరత్తు మొదలుపెట్టాయి. కేరళలో స్కూల్ అడ్మిషన్స్‌కి కొత్త ట్రెండ్ నడుస్తోంది.

Woman walked on the river : నర్మదా నదిపై నడుచుకుంటూ వెళ్లిన వృద్ధురాలు .. దేవత అంటూ ప్రచారం.. వీడియో వైరల్

ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు కొత్త అడ్మిషన్ల కోసం కొత్త ఆలోచనలు చేస్తున్నాయి. అందుకోసం మళయాల సినిమాల ప్రముఖ నటుల హిట్ డైలాగ్‌లతో ఉన్న పోస్టర్లను వాడేస్తున్నాయి. ఒలవన్న ఎయిడెడ్ లోయర్ ప్రైమరీ స్కూల్ (Olavanna Aided Lower Primary School) ఈ పోస్టర్ల ఆలోచనతో దూసుకుపోతోంది. ఇక ఈ పోస్టర్లపై మమ్ముట్టి (Mammooty) నుంచి మంగళస్సేరి నీలకందన్ (Mangalassery Neelakandan) దాకా నటులు కనిపిస్తున్నారు. ఈ స్కూల్‌కి రండి పిల్లలు అని వారంటున్నట్లు.. ఈ స్కూల్ లో చదవకపోడ వల్ల జీవితంలో తాను ఎదగలేకపోయానన్నట్లుగా వాళ్ల మధ్య డైలాగ్స్ ఉన్న పోస్టర్లు చాలా క్రియేటివ్‌గా తయారు చేశారు.

Latest Mehndi Design : ఓ పెళ్లికూతురి మెహందీ డిజైన్ చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు

తమ స్కూల్ కి కొత్తగా అడ్మిషన్లు రావాలంటే ఎలా అనే ఆలోచనల నుంచి పుట్టినవే ఈ పోస్టర్ల ఐడియా అంటున్నారు  స్కూల్ హెడ్ మాస్టర్ రంజిత్ (Ranjith). తమ ఐడియా సక్సెస్ అయినట్లు ఆయన చెప్పారు. దీని కోసం ప్రత్యేకంగా స్కూల్ టీం పని చేసిందని వీటిని సోషల్ మీడియాలో షేర్ చేయాలని అనుకోలేదని.. అనుకోకుండా అవి బయటకు వెళ్లిపోయాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తమ కాన్సెప్ట్ ను అభినందిస్తూ చాలా ఫోన్లు వచ్చాయని.. అలాగే విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని రంజిత్ చెప్పారు. కొన్ని యూట్యూబ్ వీడియోలు  వాచ్ చేసిన తర్వాత ఈ పోస్టర్లను వారి టీం ఎడిట్ చేసిందట. ఏది ఏమైనా ఈ కాలంలో ఈ మాత్రం క్రియేటివి లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ రన్ చేయడం కష్టమే కదా మరి. ఇక వీరి ఐడియాను ఎంతమంది కాపీ చేస్తారో చూడాలి.