Kerala Schools : కేరళలో కరోనా విలయం.. 9వ తరగతి వరకు స్కూళ్లు మూసివేత!
కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 13,468 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా.. 21 కరోనా మరణాలు నమోదయ్యాయి.

Kerala Shuts Schools Up To Class 9 As Covid 19 Cases Spike
Kerala Schools : కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 13,468 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా.. 21 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఆఫ్ లైన్ క్లాసులను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. దాంతో 9వ తరగతి వరకు విద్యార్థుల స్కూళ్లు మూసివేయనున్నట్టు నివేదిక వెల్లడించింది.
రాష్ట్ర సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన రివ్యూ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేరళలో కరోనా కేసుల తీవ్రత పెరిగిన క్రమంలో ప్రభుత్వ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 13,468 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. మొత్తంగా 96 కరోనా మరణాలు నమోదు కాగా.. మొత్తంగా 50,269కి మరణాల సంఖ్య చేరుకుంది.
దేశవ్యాప్తంగా.. కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలో కొత్తగా 2,64,202 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 315 మంది కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో 1,09,345 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.
రోజువారీ కరోనా పాజివిటీ రేటు 14.78 శాతానికి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 36,582,129కు చేరింది. వైరస్ బారిన పడి 4,85,350 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 12,72,03 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి మొత్తంగా 3,48,24,706 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Read Also : Heart Diseases Risk : గుండె జబ్బులు ఇందుకే వస్తున్నాయట.. షాకింగ్ వాస్తవాలు..!