Parliament Staff New Dress : కమలం పువ్వుతో పార్లమెంట్ సిబ్బందికి కొత్త డ్రెస్ .. కాషాయీకరణ అంటూ విమర్శలు
ఈ సమావేశాలకు పార్లమెంట్ సిబ్బంది అంతా కొత్త డ్రెస్ కోడ్ తో కనిపించనున్నారు. లోక్‌సభ, రాజ్యసభ సిబ్బంది అంతా ఇకనుంచి కొత్త యూనిఫాంలో కనిపించబోతున్నారు.

Parliament Staff New dress code
Parliament Staff New dress code : సెప్టెంబర్ 18నుంచి ఐదు రోజులపటు పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు ఓ ప్రత్యేకతను సంతరించుకోనున్నాయి. ఎందుకంటే ఈ సమావేశాలకు పార్లమెంట్ (Inidan Parliament) సిబ్బంది అంతా కొత్త డ్రెస్ కోడ్ (Parliament Staff New dress code) తో కనిపించనున్నారు. లోక్‌సభ, రాజ్యసభ సిబ్బంది అంతా ఇకనుంచి కొత్త యూనిఫాం(Lok Sabha, Rajya Sabha Staff New dress code)లో కనిపించబోతున్నారు. సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో సిబ్బంది కొత్త డ్రెస్‌కోడ్‌తో కనిపించబోతున్నారు.
పార్లమెంట్ చాంబర్ అటెండెంట్స్ (Parliament Chamber Attendants), అధికారులు(Officials), సెక్యూరిటీ(Security) సిబ్బంది, డ్రైవర్లు(Drivers), మార్షల్స్ (Marshals) సహా అందరూ సరికొత్త డ్రెస్ కోడ్ తో కనిపించనున్నారు. ఖాకీ రంగు ప్యాంటు, లోటస్ మోటిఫ్‌లు, మణిపురి తలపాగాలు (Manipuri turbans)వంటి కొత్త యూనిఫాంతో కనిపించబోతున్నారు. డ్రెస్ లపై లోటస్ మోటిఫ్ ( lotus motif )లు ఉండటంతో అది బీజేపీ గుర్తు కావటంతో ప్రతిపక్షాలు దీనిపై విమర్శలు సంధిస్తున్నాయి. అంతా కాషాయీకరణ చేస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు.
సిబ్బంది యూనిఫాంకు ‘ఇండియన్’ టచ్ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఇది కాషాయీకరణలో భాగమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. సిబ్బంది ధరించే నెహ్రూ జాకెట్, ఖాకీ ప్యాంట్లను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(National Institute of Fashion Technology) (NIFT) రూపొందించింది. ఉద్యోగులు బంద్ గాల సూట్ కు బదులుగా ఎరుపు, నీలం రంగులు కలిసిన మెజెంటా కలర్ నెహ్రూ జాకెట్ (Nehru jackets)ధరిస్తారు. ఆ షర్టులపై కమలం పువ్వు గుర్తును డిజైన్ చేశారు. ఈ కమలం పువ్వు బీజేపీ గుర్తు కావటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సెషన్ ప్రారంభమైనప్పుడు..గణేష్ చతుర్థి (Ganesh Chaturthi ) సందర్భంగా సెప్టెంబర్ 19న పూజ నిర్వహిస్తారు. ఆ తరువాత కొత్త పార్లమెంట్ భవనంలోకి లాంఛనంగా ప్రవేశం ఉంటుంది. కాగా పార్లమెంట్ రెండు సభల్లోను అంటే లోక్ సభ, రాజ్యసభల్లో మార్షల్స్ దుస్తులు కూడా మారాయి. మారిన దుస్తుల్లో భాగంగా మార్షల్స్ మణిపురి తలపాగాలను ధరిస్తారు. అలాగే పార్లమెంట్ భవనంలోని సెక్యురిటీ సిబ్బంది సఫారీ సూట్ కు బదులుగా మిలటరీ దుస్తులను గుర్తు చేసేలా ఉండే కామెప్లేగ్ డ్రెస్ ( camouflage dresses)ధరించనున్నారు.
సమావేశాల ఎజెండా మాత్రం ప్రకటించకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ సమావేశాల్లోనే దేశం పేరును భారత్‌గా మార్చే ప్రతిపాదన తీసుకొస్తారని సమాచారం. అయితే, రాజ్యాంగంలో ఇప్పటికే ‘ఇండియా అంటే భారత్’ అని స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో పేరు మార్పు అవసరం ఏమొచ్చిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
దుస్తులపై కమలం గుర్తు గురించి కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ మాట్లాడుతు..‘‘కమలం గుర్తు మాత్రమే ఎందుకు..? నెమలి, పులి ఎందుకు కుదరదు..? ఓహో…కమలం బీజేపీ ఎన్నికల గుర్తు కదా.. అందుకే ఈ కమలం గుర్తా..? ’’అంటూ ఎద్దేవా చేశారు.
సెప్టెంబర్ 18 నుండి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ( Parliamentary Affairs Minister Pralhad Joshi) ప్రకటించిన విషయం తెలిసిందే. ఎజెండా లేకుండా సమావేశాలు ఏంటీ అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.