అదృష్టం కలిసొచ్చింది.. ఒక్క రాత్రిలోనే గిరిజన కార్మికుడి జీవితం మారిపోయింది.. కళ్లముందు లక్షల్లో డబ్బులు.. అసలేం జరిగిందంటే?

మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలో ఓ గిరిజన కార్మికుడికి అదృష్టం వరించింది. దీంతో అతడు రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిపోయాడు.

అదృష్టం కలిసొచ్చింది.. ఒక్క రాత్రిలోనే గిరిజన కార్మికుడి జీవితం మారిపోయింది.. కళ్లముందు లక్షల్లో డబ్బులు.. అసలేం జరిగిందంటే?

money

Updated On : July 10, 2025 / 2:30 PM IST

Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలో ఓ గిరిజన కార్మికుడికి అదృష్టం వరించింది. దీంతో అతడు రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిపోయాడు. గనిలో దొరికిన ఓ వజ్రం అతని జీవితాన్ని మార్చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పన్నా జిల్లాలో వందలాది కుటుంబాలు వజ్రాల అన్వేషణలో నిమగ్నమయ్యాయి. ఒక అంచనా ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉన్న పన్నా జిల్లాలో 12లక్షల క్యారెట్ల వజ్రాల నిక్షేపాలు ఉన్నాయి. పన్నాలో ఉన్న వజ్రాల కార్యాలయంలో రూ.200 చెల్లించి వజ్రాల గనిని లీజుకు తీసుకోవచ్చు. వజ్రాల నిల్వల అంచనా ఉన్న ప్రాంతంలో తవ్వకం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తికి ప్రభుత్వం 8 x 8 మీటర్ల భూమిని లీజును ఇస్తుంది. వారికి కేటాయించిన దానిలో వజ్రాల కోసం తవ్వకాలు చేసుకోవచ్చు.

లీజుకు తీసుకునే కుటుంబం వజ్రాలను మాత్రమే తవ్వి తీయాలి. వజ్రం దొరికినా దొరకకపోయినా తవ్విన గుంతలో మట్టి అంతా నింపాలి. వందలాది మంది కొన్ని సంవత్సరాలుగా ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే, వీరిలో ప్రతీయేటా ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే వజ్రాలు దొరకడం ద్వారా లక్షాధికారులు అవుతున్నారు. గనిలో వజ్రం దొరికితే.. రూల్స్ ప్రకారం.. దానిని పన్నాలోని వజ్రాల కార్యాలయంలో అధికారులకు హ్యాండోవర్ చేయాలి. రూ.5వేలు రుసుము చెల్లించాలి. ఆ తరువాత ఆ వజ్రాన్ని అధికారులు వేలం వేస్తారు. వేలం ద్వారా వచ్చిన మొత్తంలో 12శాతం రాయల్టీని తీసేసి మిగతా డబ్బును కార్మికుడికి ఇచ్చేస్తారు. ఇలా ఇటీవల ఓ గిరిజన కార్మికుడికి వజ్రం దొరికింది. దాని విలువ రూ.40లక్షలు ఉంటుంది.

11.95 క్యారెట్ల వజ్రం దొరికింది..
వజ్రాల గనిలో పనిచేస్తున్న నలుగురు కార్మికులకు జాక్ పాట్ తగిలింది. రూ. 40లక్షలకుపైగా విలువ చేసే 11.95 క్యారెట్ల వజ్రం దొరికింది. మరో ముగ్గురితో కలిసి కార్మికుడు మాధవ్ కృష్ణ పన్నా జిల్లా కల్యాణ్‌పూర్‌పట్టి ప్రాంతంలోని ఓ గనిలో 15ఏండ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల తవ్వకాల్లో ఆయనకు వజ్రం దొరకగా.. దానిని రూల్స్ ప్రకారం పన్నాలోని వజ్రాల కార్యాలయం అధికారులకు హ్యాండోవర్ చేశాడు. ఆ వజ్రాన్ని భద్రపరిచామని, త్వరలోనే వేలం వేస్తామని వజ్ర కార్యాలయ అధికారి రవి పటేల్ తెలిపారు. వేలం ద్వారా వచ్చిన మొత్తంలో 12శాతం రాయల్టీని తీసేసి మిగతా డబ్బును కార్మికుడికి అందజేస్తామని తెలిపారు.