Lalu Prasad Yadav: త్వరగా కోలుకో నాన్న.. లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె భావోద్వేగ ట్వీట్..
‘నాన్నా నువ్వే నా హీరో.. నా బ్యాక్ బోన్ నువ్వే.. త్వరగా కోలుకో నాన్నా’ అంటూ.. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్య తన ట్విటర్ ఖాతాలో భావోద్వేగ పోస్టు చేశారు. లాలూ ప్రసాద్ యావ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Lalu Prasad
Lalu Prasad Yadav: ‘నాన్నా నువ్వే నా హీరో.. నా బ్యాక్ బోన్ నువ్వే.. త్వరగా కోలుకో నాన్నా’ అంటూ.. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్య తన ట్విటర్ ఖాతాలో భావోద్వేగ పోస్టు చేశారు. లాలూ ప్రసాద్ యావ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీపు భాగంలో గాయమై భుజం విరగడంతో ఆయన పట్నాలోని పారస్ ఆస్పత్రిలో ఐసీయూలో వైద్యం పొందుతున్నారు.
నేడు ఆర్జేడీ 26వ వ్యవస్థాపక దినోత్సవం. కానీ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో వేడుకలకు దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. లాలూ ప్రసాద్ యాదవ్ కొద్దికాలంగా జైలు జీవితం గడిపారు. అనారోగ్యం కారణంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా లాలూ ఆరోగ్యం క్షీణించడంతో ఇద్దరు కుమారులకు బాధ్యతలు అప్పగిస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో లాలూ భార్య రబ్రీదేవీ ఈ వార్తలను ఖండించిన విషయం విధితమే.
https://twitter.com/RohiniAcharya2/status/1544149428898263042?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1544149428898263042%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-27005523111288338627.ampproject.net%2F2206101637000%2Fframe.html
తాజాగా లాలూ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన కుమార్తె రోహినీ ఆచార్య ట్వీట్ చేయడం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం సింగపూర్ లో ఉన్న ఆమె వీడియో కాల్ ద్వారా తన తండ్రి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలువాలని ఆకాంక్షించారు. ఐసీయూలో లాలూ ప్రసాద్ యాదవ్ చికిత్స పొందుతున్న ఫొటోలను తన ట్వీట్ లో జోడించారు.