ఇంటి అద్దె కోసం ఒత్తిడి చేయొద్దు.. ఇళ్ల యజమానులను హెచ్చరించిన కేంద్రం

కరోనా ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్రం ఒక్కొక్కటిగా అస్త్రాన్ని బైటకు తీస్తోంది. తాజాగా అద్దెకుంటున్నవారికి ఉపశమనం కోసం ఇంటి యజమానులు అద్దె కోసం ఒత్తిడి చేయకూడదని కోరింది. తాము చెప్పినా, అద్దె కట్టాల్సిందేనంటూ డిమాండ్ చేస్తే చర్యలు తీసుకొంటామని తేల్చేసింది. నెలపాటు అద్దె అడక్కూడదని ఆదేశించింది.
కరోనా వైరస్ కన్నీళ్లు పెట్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెడుతున్న కరోనా వైరస్.. మానవాళిని ఇబ్బంది పెడుతున్న కరోనా వైరస్ కారణంగా.. కూలీలు, రోజువారీ జీతగాళ్లు… చిన్నాచితకా పనిచేసుకునే వాళ్లు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. ప్రభుత్వాలు వారికి సాయండా కాస్త ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ, ఊర్ల నుంచి పనులకు నగారాలకు వలసలు వచ్చి ఇబ్బంది పడుతున్న వారి పరిస్థితి దయనీయం.
రోజువారీ కూలీ పనులు లేక ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలు అందక తిండికే జరగని పరిస్థితిలో నగరాల్లో ఉద్యోగులు, కూలిపని చేసుకునే వారు, విద్యార్థులు.. ఒకటేమిటి అన్ని రంగాల వారూ ఇంటి రెంట్లు కూడా కట్లలేని పరిస్థితిలో ఉన్నారు. ఊర్లకు వెళ్లాలంటే ఉన్న చోట నుంచి కదిలే పరిస్థితి లేదు. ఇప్పుడు పడే కష్టాలు ఒక ఎత్తయితే, రాబోయే రోజుల్లో ఎదురయ్యే కష్టాలు మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఇంటి అద్దె కట్టడం ఎలా? హాస్టల్ ఫీజు కట్టడం ఎలా? కూరగాయల పరిస్థితి ఏంటి? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఆ ప్రాంతంలో కూలీ పనులు చేసుకుంటూ జీవితం గడుపుతున్న వారి నుంచి ఒక నెల అద్దె తీసుకోరాదంటూ.. జిల్లా మేజిస్ట్రేట్ బిఎన్ సింగ్ ఆదేశించారు.
ఈ మేరకు ఓ ఉత్తర్వును విడుదల చేశారు. గౌతమ్ బుద్ధ నగర్ లోని ఓనర్లు ఒక నెల తరువాత మాత్రమే కార్మికుల (అద్దెదారుల) నుండి అద్దెకు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితులలో అద్దెదారుల నుంచి అద్దె తీసుకోవడం కరెక్ట్ కాదని, దయచేసి సహకరించండి అని ఆయన కోరారు.
ఉత్తర్వుల పాటించకుండా అద్దె వసూలు చేస్తే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించబడతారు. అద్దె ఇవ్వలేదని బయటకు నెట్టేస్తే మాత్రం శిక్ష రెండేళ్ల వరకు పొడిగిస్తారు. కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసే ప్రయత్నంలో మార్చి 24వ తేదీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ సమయంలో కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుంది.
21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్ గా అమలుచేయాలని ఆదివారం(మార్చి-29,2020)అన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ సమయంలో కాలంలో ఎటువంటి కోత లేకుండా కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించేలా చూడాలని కేంద్రం తెలిపింది. ఈ కాలానికి(లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులు) గృహ అద్దె డిమాండ్ చేయకూడదు. కార్మికులను లేదా విద్యార్థులను ప్రాంగణాన్ని ఖాళీ చేయమని అడుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి అని కేంద్రం చెప్పింది.
వలస కార్మికులతో సహా పేద ప్రజల ఆహారం మరియు ఆశ్రయం కోసం తగిన ఏర్పాట్లు వారి పని ప్రదేశంలో ఏర్పాటు చేయాలని కేంద్రం తెలిపింది. ఈ ప్రయోజనం కోసం ఎస్‌డిఆర్‌ఎఫ్ నిధులను ఉపయోగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
Order by which Landlords in Gautambuddhanagar can take rent from workers ( tenants) only after a month. No exodus of workers on rent ground will be allowed in present circumstances. Please ensure and cooperate. pic.twitter.com/ucn5I0oe68
— DM G.B. Nagar (@dmgbnagar) March 28, 2020
Also Read | కేసీఆర్ ప్రకటన : చికెన్..గుడ్లకు ఫుల్ డిమాండ్