Jammu And Kashmir : ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం

Jammu And Kashmir : ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం

Jammu And Kashmir

Updated On : June 29, 2021 / 10:06 AM IST

Jammu And Kashmir : జమ్మూ కాశ్మీర్ లోని పరింపోరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాది, లష్కరే తోయిబా కమాండర్ నదీమ్ అబ్రార్ హతమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబందించిన వివరాలను వెల్లడించారు. సోమవారం పరింపోరాలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ సిబ్బంది వాహన తనిఖీ చేపట్టారు. ఈ సమయంలోనే ఓ కారును ఆపారు. కారులో తనిఖీ చేస్తుండగా వెనక సీట్లో కూర్చున వ్యక్తి హ్యాండ్ గ్రానైడ్ విసిరేందుకు యత్నించాడు.

వెంటనే సీఆర్పీఎఫ్ బలగాలు అతడిని పట్టుకొని ముఖానికి ఉన్న ముసుగు తొలగించారు. అతడు లష్కరే తోయిబా టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ గురించిన సీఆర్ఫీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకోని విచారించారు. ఇదే సమయంలో ఆయుధాలు ఉన్న ప్రదేశం గురించి తెలిపాడు. నదీమ్ అబ్రార్ తీసుకోని ఆయుధాలు దాచిన ప్రదేశానికి వెళ్లారు సీఆర్పీఎఫ్ సిబ్బంది.

అక్కడే ఉన్న మరో ఉగ్రవాది భద్రతాదళాలపై కాల్పులు జరిపాడు.. దీంతో బలగాలు ఫైరింగ్ ఓపెన్ చేసి ఇద్దరినీ అంతమొందించాయి. ఘటనాస్థలంలో అధికారులు ఓ ఏకే 47తోపాటు మరికొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ముగ్గురికి గాయాలయ్యాయి. కాగా నదీమ్ అబ్రార్ అనేక హత్యకేసులో నిందితుడిగా ఉన్నారు.