Jamili Elections : జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదు.. జాతీయ లా కమిషన్ కీలక ప్రకటన

రాజ్యాంగంలోని ప్రస్తుత చట్టాలను సవరించకుండా జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తెలిపింది. జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాల ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించింది.

Jamili Elections : జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదు.. జాతీయ లా కమిషన్ కీలక ప్రకటన

Law Commission Of India

Jamili Elections – Law Commission Of India : జమిలి ఎన్నికలపై జాతీయ లా కమిషన్ తేల్చేసింది. జమిలి ఎన్నికలపై జాతీయ లా కమిషన్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికిప్పుడు జమిలి ఎన్నికలు సాధ్యం కావంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. 2024లో జమిలి ఎన్నికలు ఉండబోవని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ప్రస్తుత చట్టాలను సవరించకుండా జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తెలిపింది.

జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాల ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించింది. పూర్తి నివేదికకు మరి కొంత సమయం పడుతుందని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం నివేదిక ప్రక్రియ జరుగుతుందని తెలిపింది. శనివారం జమిలి ఎన్నికలపై లా కమిషన్ కీలక సమావేశం నిర్వహించింది. ఒకే సారి ఎన్నికలు నిర్వహించడంపై కసరత్తు చేస్తోంది.

One Nation One Election: మోదీ ప్రభుత్వానికి షాక్.. జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసిన లా కమిషన్

లా కమిషన్ చైర్మన్ నేతృత్వంలో సమావేశం అయ్యారు. జమిలి ఎన్నికల అంశాలపై లోతుగా చర్చించి తగు సిఫార్సులతో కేంద్రానికి నివేదికను అందించనున్నారు. జమిలి ఎన్నికలకు రాజ్యాంగ పరమైన సవరణలు చేయాలని లా కమిషన్ తన నివేదికలో సూచించబోతుందని తెలుస్తోంది.

జమిలి ఎన్నికల నిర్వహణపై 2022 డిసెంబర్ 22న జాతీయ లా కమిషన్ జాతీయ రాజకీయ పార్టీలు, భారత ఎన్నికల కమిషన్, బ్యూరోక్రాట్లు, విద్యావేత్తలు, నిపుణుల ముందు ఆరు ప్రశ్నలు ఉంచింది. దీనిపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్న లా కమిషన్ 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు తన నివేదికను పబ్లిష్ చేయబోతుందని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు సమర్పించనుందని సమాచారం.