LIC : ఎల్ఐసీ షేరు ధర ఫిక్స్.. ఎంతంటే?!

సంస్థలో 3.5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయలు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్‌ఐసీ విలువ మొత్తం 6 లక్షల కోట్లుగా లెక్కగట్టారు.

LIC : ఎల్ఐసీ షేరు ధర ఫిక్స్.. ఎంతంటే?!

Lic

Updated On : April 27, 2022 / 8:06 AM IST

LIC share price : LIC షేరు ధర ఫిక్స్ అయింది. 902 రూపాయల నుంచి 949 రూపాయల మధ్య ఉండనుంది. పబ్లిక్ ఇష్యూ వచ్చే నెల 4న ప్రారంభమై 9న క్లోజ్ చేయనున్నారు. ఇక పాలసీ దారులకు 60 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎల్ఐసీ ఉద్యోగులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు 45 రూపాయల చొప్పున డిస్కౌంట్ ఇవ్వబోతున్నటు సమాచారం. ఎల్‌ఐసీ సంస్థలో 3.5 శాతం వాటా విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం 21 వేల కోట్లు ఆర్జించనుంది. అయితే, ఎల్‌ఐసీ ఐపీవో తేదీలు, షేర్‌ ధరలపై మరో రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది.

సంస్థలో 3.5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయలు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్‌ఐసీ విలువ మొత్తం 6 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. గత ఫిబ్రవరిలో వేసిన ప్రణాళిక మేరకు ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను ఐపీఓలో విక్రయించాల్సి ఉంది.

LIC IPO : మే 4 నుంచి ఎల్‌ఐసీ ఐపీవో

మార్కెట్‌లో అస్థిరత, యుక్రెయిన్ యుద్ధ పరిణామాలు, అమెరికా వడ్డీ రేట్ల భయాలతో.. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేసినా.. ఎల్‌ఐసీ వాటాల విక్రయం..వెనక్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది కేంద్రం. సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు పరుగులు పెడుతోంది. ఎల్‌ఐసీ స్టాక్ మార్కెట్‌లో ఎంట్రీపై మదుపర్లలోనూ ఆసక్తి నెలకొంది.