LIC IPO : మే 4 నుంచి ఎల్‌ఐసీ ఐపీవో

ఐపీఓ ద్వారా 21 వేల కోట్ల రూపాయలు సమీకరించనున్నారు. ఇది గతంలో అంచనా వేసిన దాని కంటే చాలా తక్కువ. గతంలో దాదాపు 60 నుంచి 63 వేల కోట్ల రూపాయల వరకూ సమీకరించాలని భావించారు.

LIC IPO : మే 4 నుంచి ఎల్‌ఐసీ ఐపీవో

Lic Ipo

LIC IPO : మార్కెట్‌ వర్గాల్లో రోజురోజుకు ఉత్కంఠ రేపుతున్న ఎల్‌ఐసీ ఐపీఓపై క్లారిటీ వచ్చేసింది. మే 4 నుంచి ఎల్‌ఐసీ ఐపీవో మొదలుకానుంది. 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఇవాళ లేదా రేపు ఇష్యూ ప్రైస్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఒక్కో షేర్ ధర వెయ్యి రూపాయల కంటే కాస్త తక్కువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటాలను ప్రభుత్వం విక్రయించనుంది.

ఐపీఓ ద్వారా 21 వేల కోట్ల రూపాయలు సమీకరించనున్నారు. ఇది గతంలో అంచనా వేసిన దాని కంటే చాలా తక్కువ. గతంలో దాదాపు 60 నుంచి 63 వేల కోట్ల రూపాయల వరకూ సమీకరించాలని భావించారు. అయితే మారిన పరిస్థితుల్లో కేంద్రం రాజీ పడాల్సి వచ్చింది. ఈ మేరకు ఎల్‌ఐసీ విలువను సవరించి ప్రస్తుతానికి 6 లక్షల కోట్లగా లెక్కకట్టారు.

MLC Kavitha : ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? కేంద్రానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న!

మార్కెట్‌లో అస్థిరత, యుక్రెయిన్ యుద్ధ పరిణామాలు, అమెరికా వడ్డీ రేట్ల భయాల నేపథ్యంలో.. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేసినా.. ఎల్‌ఐసీ వాటాల విక్రయం..వెనక్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది కేంద్రం. సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు పరుగులు పెడుతోంది. ఆలస్యమైతే.. కేంద్రం పెట్టుకున్న పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యానికి గండిపడుతుంది.