ఇదేనా అభివృద్ధి : జంతువులు త్రాగే నీళ్లను త్రాగుతున్నారు
"అభివృద్ధి చెందుతున్న భారత్" చిన్నతనం నుంచి ఈ పదం మనం వింటూనే ఉన్నాం.ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.పాలకులు మారారు.

“అభివృద్ధి చెందుతున్న భారత్” చిన్నతనం నుంచి ఈ పదం మనం వింటూనే ఉన్నాం.ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.పాలకులు మారారు.
“అభివృద్ధి చెందుతున్న భారత్” చిన్నతనం నుంచి ఈ పదం మనం వింటూనే ఉన్నాం.ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.పాలకులు మారారు. కొత్త కొత్త నినాదాలు ఇచ్చి ప్రజల చేత ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రులు,ప్రధానమంత్రులు అయ్యారు.అయితే దేశంలో ఇప్పటికి కూడా ప్రజలకు కనీస అవసరమైన త్రాగునీటిని మన పాలకులు అందించలేకపోతు.రాకెట్ లు,శాటిలైట్ లు అంటూ ప్రపంచంలోనే టెక్నాలజీలో నెం.1గా దూసుకెళ్తున్న భారత్ లోని వాస్తవ పరిస్థితులు ఏ దేశంలో కూడా ఉండని విధంగా దారుణంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చత్తీస్ ఘడ్ లోని ఓ గ్రామంలోని వాస్తవ పరిస్థితులు చూస్తే ఇదేనా స్వచ్ఛమైన భారత్,ఇదేనా దేశం దూసుకెళ్లడం అంటే,ఇదేనా అభివృద్ధి అంటూ కామెంట్ చేయకుండా ఉండలేరేమో.
Read Also : వాడెవడండీ బాబూ : ఆ సీమ పోలింగ్ బూతుల్లో మంత్రించిన ఆవాలు
చత్తీస్ ఘడ్ లోని బలరామ్ పూర్ జిల్లాలో త్రాగునీటిి సమస్య తీవ్రంగా ఉంది.మంచినీళ్ల కోసం ప్రజలు కిలోమీటర్ల దూరం ఎండలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి.దీంతో గంటలకొద్ది ఎండలో నడిచి వెళ్లలేని వాళ్లు జంతువుల కోసం ఏర్పాటు చేసి ఉన్న గుంటలలోని నీళ్లు త్రాగుతూ జీవిస్తున్నారు. బలరామ్ పూర్ జిల్లాలోని చర్చారీ గ్రామంలో 150మంది ప్రజలు నివసిస్తున్నారు.వీరిలో రోజువారి కూలీ పనులు చేసుకునేవాళ్లు ఎక్కువగా ఉన్నారు.నాలుగు నెలలుగా త్రాగునీటి కొరత ఏర్పడటంతో జంతువుల కోసం ఏర్పాటు చేసి ఉన్న గుంటలలోని నీళ్లు త్రాగుతూ జీవిస్తున్నారు. ఈ నీళ్లను త్రాగడం ద్వారా రోగాలు వస్తున్నాయని,తమ పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురౌతున్నారని స్థానిక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
తమను మనుషులుగా గుర్తించాలని ఆమె కోరింది. సమస్యను పరిష్కరించేందుకు ఏ ఒక్క నాయకుడు తమ గ్రామనాకి రారని,కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులకు తాము గుర్తుకొస్తామని ఆమె తెలిపింది.స్థానిక యంత్రాంగానికి పరిస్థితిని తెలియజేసినప్పటికీ అధికారులు అసలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.గ్రామంలోని త్రాగునీటి సమస్య గురించి పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ కు వివరించినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు.అయితే అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
Read Also : జలియన్ వాలాబాగ్ ఘటనకు 100ఏళ్లు : స్మారక నాణెం,పోస్టల్ స్టాంప్ విడుదల