Delhi Lockdown : ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగింపు
కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

Delhi Lockdown
Lockdown extension in Delhi : కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను మరో వారం రోజులపాటు పొడిగిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మే2న ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.
ఢిల్లీలో కరోనా ఉధృతి ఇంకా తగ్గలేదని కేజ్రీవాల్ తెలిపారు. నిన్న రికార్డు స్థాయిలో 357 మంది మృతి చెందారని తెలిపారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆక్సిజన్ సరఫరా, నిర్వహణకు పోర్టల్ ప్రారంభించామని తెలిపారు.
తయారీదారులు, సరఫరాదారులు, ఆస్పత్రులతో కలిసి ఈ పోర్టల్ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి 2 గంటలకు ఒకసారి ఆక్సిజన్ వివరాలు అప్‌డేట్ అవుతాయని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలతో మాట్లాడినప్పుడు కూడా లాక్‌డౌన్ పొడిగించాలనే కోరారని కేజ్రీవాల్ వెల్లడించారు.