లాక్ డౌన్ పై హైకోర్టు ఆదేశాలను తోసిపుచ్చిన యోగి సర్కార్

దేశంలో కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్తర్​ప్రదేశ్​ రెండో స్థానంలో ఉంది.

లాక్ డౌన్ పై హైకోర్టు ఆదేశాలను తోసిపుచ్చిన యోగి సర్కార్

Lockdown In Lucknow 4 Other Up Cities From Tonight Till April 26

Updated On : April 19, 2021 / 8:25 PM IST

Lockdown దేశంలో కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్తర్​ప్రదేశ్​ రెండో స్థానంలో ఉంది. యూపీలో ఇప్ప‌టివ‌ర‌కు 1.91 ల‌క్ష‌ల యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.ఈ నేపథ్యంలో వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు వైరస్​ వ్యాప్తి అధికంగా ఉన్న ఐదు నగరాల్లో ఈ నెల 26 వ‌ర‌కు లాక్‌డౌన్ విధించాలని అలహాదాబ్ హైకోర్టు యోగి ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ల‌క్నోతోపాటు ప్ర‌యాగ్‌రాజ్‌, వార‌ణాసి, కాన్పూర్‌, గోర‌ఖ్‌పూర్ న‌గ‌రాల్లో లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వానికి సూచించింది. కేవలం గ్రాస‌రీ స్టోర్లు, మెడిక‌ల్ షాప్‌లు(ముగ్గురి కంటే త‌క్కువ మంది సిబ్బందితో నడపాలి)వంటి అత్యవసర సర్వీసులు మాత్రమే తెరిచేందుకు అనుమతివ్వాలని, లాక్ డౌన్ రోజుల్లో అన్ని దుకాణాలు, మ‌త‌ప‌ర‌మైన కార్య‌క‌లాపాల‌ను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది.

ఇక, ఐదు నగరాల్లో లాక్ డౌన్ విధించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించటానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సోమవారం సాయంత్రం నిరాకరించింది. ఈ ఉత్తర్వును అమలు చేయబోమని, ఎందుకంటే, మహమ్మారి.. వైద్య మౌలిక సదుపాయాలను వాస్తవంగా అసమర్థంగా చేసింది . ప్రత్యేకించి ప్రయాగ్రాజ్, లక్నో, వారణాసి, కాన్పూర్ మరియు గోరఖ్పూర్ వంటి నగరాల్లో జీవితాలు మరియు జీవనోపాధి రెండింటినీ రక్షించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తెలిపింది.