వారణాసిలో పుంజుకున్న ప్రధాని మోదీ.. కాంగ్రెస్ అభ్యర్థిపై ఆధిక్యం
వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో మొదట్లో వెనుకబడిన ప్రధాని నరేంద్ర మోదీ ముందంజలోకి వచ్చారు.

PM Modi
PM Modi :వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో మొదట్లో వెనుకబడిన ప్రధాని నరేంద్ర మోదీ ముందంజలోకి వచ్చారు. కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ముందంజలోకి దూసుకెళ్లారు. ప్రధాని మోదీపై స్వల్ప ఆధిక్యం కనబరిచారు. తర్వాత మోదీ పుంజుకుని ముందంజలోకి వచ్చారు. మొదట్లోనే ప్రధాని మోదీ వెనుకంజ వేయడం బీజేపీ శ్రేణులను ఆందోళనకు గురిచేసింది. అయితే తర్వాత పుంజుకుని ఆధిక్యంలోకి రావడంతో కమలనాథులు ఊపిరిపీల్చుకున్నారు.
ఉదయం 10 గంటలకు అందిన సమాచారం ప్రకారం..
నరేంద్ర మోదీకి వచ్చిన ఓట్లు: 36424
అజయ్ రాయ్ కి వచ్చిన ఓట్లు: 35805