Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏడున్నర గంటలపాటు చర్చ కొనసాగింది.

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం

Women Reservation Bill

Womens Reservation Bill – Lok Sabha: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. నారీ శక్తి వందన్‌ అభియాన్‌ (Nari Shakti Vandan Abhiyan Bill) పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏడున్నర గంటలపాటు చర్చ కొనసాగింది.

ఈ బిల్లుకు 454 ఓట్లు అనుకూలంగా పడగా, రెండు ఓట్లు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ బిల్లు దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ మంగళవారమే ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు విపక్ష పార్టీల నుంచి కూడా మద్దతు దక్కింది. ఎంఐఎం మాత్రమే మద్దతు తెలపలేదు.

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోద ముద్ర పడడంతో ఇది రాజ్యసభకు వెళ్లనుంది. కొత్త పార్లమెంటు భవనంలో ఆమోదం పొందిన తొలి బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లే. లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందడంతో పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును రూపొందించారు.

కాగా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో.. ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పుల ద్వారా ఓటింగ్ జరిగింది. బిల్లుపై జరిగిన చర్చల్లో దాదాపు 60 మంది ఎంపీలు తమ అభిప్రాయాలు తెలియజేశారు.

Chandrababu Custody : చంద్రబాబు కస్టడీపై ముగిసిన వాదనలు.. రేపు ఉదయం 11.30గంటలకు తీర్పు, సర్వత్రా తీవ్ర ఉత్కంఠ