బీహార్ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా లండన్‌ మహిళ పోటీ!

  • Published By: sreehari ,Published On : March 9, 2020 / 04:02 AM IST
బీహార్ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా లండన్‌ మహిళ పోటీ!

Updated On : March 9, 2020 / 4:02 AM IST

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా లండన్ ఆధారిత మహిళ పుష్పాం ప్రియా చౌదరి తన పేరును ప్రకటించారు. జనతా దళ్ యునైటెడ్ ఎమ్మెల్సీ వినోద్ చౌదరి కుమార్తె ప్రియా చౌదరి. తన కుమార్తె ప్రియా సీఎం అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు వినోద్ చౌదరి తమ రాష్ట్రంలోని హిందీ, ఇంగ్లీష్ పలు పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్ ద్వారా ప్రకటించారు. ప్రియా చౌదరి దర్భాంగా ప్రాంతానికి చెందినప్పటికీ ఆమె లండన్ లోనే ఉంటున్నారు. పత్రిక ప్రకటనలో ప్రియను అధ్యక్షురాలు, ప్లూరాల్స్, సీఎం అభ్యర్థిగా పేర్కొన్నారు. బీహార్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్టు ప్రకటనలో ప్రస్తావించారు.

మహిళల దినోత్సవం సందర్భంగా పత్రికా ప్రకటన ద్వారా ప్రియ చౌదరి సీఎం అభ్యర్థిగా ప్రకటించినట్టు Plurals అనే ప్లాట్ ఫాం పేర్కొంది. అందులో ఒకరు బీహార్ ను ప్రేమిస్తే.. రాజకీయాలను ద్వేషిస్తారని క్యాప్షన్ ఉంది. ఈ ప్రకటనలో.. చౌదరి బహిరంగ లేఖను కూడా జతచేశారు. ఈ ఎన్నికల్లో తాను గెలిస్తే.. రాష్ట్ర ముఖ్యమంత్రిని అవుతానని, 2025 నాటికి బీహార్ రాష్ట్రాన్ని అభివృద్ధిచెందిన రాష్ట్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు.

‘బీహార్ లో శాంతి అవసరం ఉంది. రాష్ట్రానికి కొత్త రెక్కలు అవసరం ఎంతో ఉంది. మార్పు కూడా అవసరం.. ఎందుకంటే బీహార్ లో సాధ్యమైనంత తొందరగా అభివృద్ధి జరగాల్సి ఉంది. చెత్త రాజకీయాలను తిరస్కరించండి. ఫ్లూరల్స్ లో జాయిన్ అవ్వండి.. 2020 నాటికి బీహార్ అభివృద్ధిపథంలో నడిచేలా చేద్దాం’ అంటూ ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. సీఎం అభ్యర్థిగా ప్రకటించిన పుష్పాం ప్రియా చౌదరి తన విద్యార్హతల వివరాలను కూడా ప్రస్తావించారు.(సోషల్ మీడియాకు ఇక సెలవ్: మోడీ అకౌంట్లు మహిళలకు అంకితం)

యూకెలోని సుస్సెక్స్ యూనివర్శిటీలో ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ డెవలపమెంట్ స్టడీస్ నుంచి డెవలప్ మెంట్ స్టడీస్ లో MA పూర్తి చేశారు. యూకేలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆమె పూర్తి చేశారు. ప్రస్తుతం.. బీహార్ రాష్ట్రంలో BJP-JDU-LJP సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది.. ఈ ప్రభుత్వానికి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రియా చౌదరి తండ్రి వినోద్ చౌదరి జేడీయూ నేతగా ఉన్నారు.