ఎవరీ పుష్పం ప్రియా? బిహార్ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బరిలోకి లండన్ అమ్మాయి

  • Published By: sreehari ,Published On : March 12, 2020 / 05:10 AM IST
ఎవరీ పుష్పం ప్రియా? బిహార్ ఎన్నికల్లో  సీఎం అభ్యర్థిగా బరిలోకి లండన్ అమ్మాయి

Updated On : March 12, 2020 / 5:10 AM IST

బిహార్ రాజకీయాలపై లండన్ ఆధారిత మహిళ ఆసక్తి చూపిస్తోంది. సొంతంగా ఓ కొత్త పార్టీ స్థాపించింది. ‘ప్లూరల్స్’ అనే పార్టీ పేరుతో తానే సీఎం అభ్యర్థిగా ప్రకటించుకుంది. 2020 అక్టోబర్‌ నెలలో జరగబోయే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  అధికార JDU పార్టీ, RJD ప్రతిపక్షంలో ప్రధాన పార్టీలను ఢీకొట్టేందుకు రెడీ అయింది. లవ్ బిహార్.. హేట్ పాలిటిక్స్ అనే పార్టీ నినాదంతో బిహార్ ఎన్నికల బరిలోకి దిగుతోంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతానని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇంతకీ ఆ మహిళ ఎవరో కాదు.. JD(U)నేత వినోద్ చౌదరి కుమార్తె పుష్పం ప్రియా చౌదరి. దర్బంగకు చెందిన ఈమె.. ప్రస్తుతం లండన్ లో ఉంటోంది. మార్చి 8న మహిళల దినోత్సవం సందర్భంగా బిహార్ ఎన్నికల్లో తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించుకుంది.

తన సోషల్ మీడియా పోస్టులో ప్రియా.. తాను ‘Plurals’ పార్టీ అధ్యక్షురాలిగా ప్రస్తావించింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రకటించుకుంది. దీనికి ‘Plurals పార్టీ వచ్చేసింది’ అంటూ ట్యాగ్ లైన్ కూడా జతచేసింది. బిహార్ రాష్ట్రంపై అభిమానం ఉండి.. ప్రస్తుత రాజకీయాలను ద్వేషించేవారంతా తన పార్టీలో చేరవచ్చునని కోరింది.

‘లవ్ బిహార్.. హేట్ పాలిటిక్స్’ అనే నినాదంతో తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్టు పెట్టింది. తన కొత్త పార్టీ Plurals కు సంబంధించిన వెబ్ సైట్లో బిహార్ రాజకీయ నేతల అసమర్థతపై విమర్శలు చేస్తూ సవాల్ విసురుతోంది. ఇలాంటి వ్యవస్థను ఎదుర్కొనేందుకు తనతో చేతులు కలపాల్సిందిగా అందరిని కోరుతోంది. డర్టీ పాలిటిక్స్ తిరస్కరించండి అంటూ ప్రియా తన వెబ్ సైట్లో కోరింది. 

మాజీ జనతా దళ్ (యూనైటెడ్) ఎమ్మెల్సీ వినోద్ చౌదరీ కుమార్తె.. ప్రియా చౌదరి. యూకేలోనే తన ఉన్నత చదువులను పూర్తిచేసింది. వెబ్ సైట్లో తన విద్యార్హతలను కూడా పొందుపరిచింది. డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు.

వాలంటీర్లు, సపోర్టర్లు పార్టీ తరపున నిధులు విరాళంగా ఇవ్వాలనుకుంటే ఈ వెబ్ సైట్లో ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చునని ఆఫర్ చేస్తున్నారు ప్రియా.. ప్రస్తుతం, బిహార్ రాష్ట్రంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలతో BJP-JD(U)-LJP సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది.

See Also | కరోనావైరస్ గాల్లో 3 గంటలు.. ప్లాస్టిక్, స్టీల్‌పై 3 రోజులు ఆలస్యంగా కనిపిస్తుంది