భర్త కోసం భార్య మోసం.. 3నెలల్లో 3పెళ్లిళ్లు, నగలతో పరారీ

పెళ్లంటే ఒకరితో ఏర్పడే బంధం.. ఒక వ్యక్తితో జీవితాంతం కలిసి బతుకుతామనే నమ్మకం అనే వాటిని పక్కకు పెట్టేసింది ఆ మహిళ. పెళ్లిని కూడా డబ్బు సంపాదించడం కోసం వాడేసింది. పలువురిని పెళ్లి చేసుకుని వాళ్లు పెట్టిన బంగారంతో ఉడాయించింది.
భర్త కోసం భార్య మోసం:
27ఏళ్ల యువతిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు నిజాలు తెలిసి షాక్ అయ్యారు. ముకుంద్‌వాడీ ఏరియాలో ఉండే వ్యక్తి ఉద్యోగం పోయింది. దీంతో అతని కుటుంబం ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోయింది. వీటి నుంచి గట్టెక్కేందుకు అతని భార్య విజయ అమృతె ఓ రాకెట్ లో చేరింది.
నా భార్యను వెదకండి ప్లీజ్:
మూడు నెలల్లో ముగ్గురు వ్యక్తులను పెళ్లి చేసుకుని దొరికిపోయింది. నాశిక్ జిల్లాకు చెందిన యోగేశ్ శిర్సత్ తన భార్య వేరొకరిని పెళ్లి చేసుకుని నగలు తీసుకుని పరారీ అయినట్లుగా భావించి వెదకడం మొదలుపెట్టాడు. కంప్లైంట్ ఫైల్ చేసిన పోలీసులు నిందితురాలిని శనివారం అరెస్టు చేశారు.
https://10tv.in/mumbai-pet-dog-saves-woman-after-shirtless-stalker-enters-house-to-sexually-assault-her/
నిజం తెలిసిందిలా:
ప్రాథమిక విచారణలో ఆమె యోగేశ్ ను పెళ్లి చేసుకుని ఒకరోజు మాత్రమే ఉండి వెళ్లిపోయానని చెప్పింది. ఆ తర్వాత రాయ్‌ఘడ్‌కు చెందిన సందీప్ దరాదెను పెళ్లాడానని, వెస్టరన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని మూడో వివాహం చేసుకున్నానని పోలీసులకు తెలిపింది.
పెళ్లికి ఖర్చులు అని చెప్పి:
ఆ మహిళ ఇద్దరు వ్యక్తులతో చేతులు కలిపింది. వధువు కావాలని వెదికే వారి కోసం చూసి టార్గెట్ పెట్టుకోవడం. వాళ్లతో పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత పెళ్లి ఖర్చులు అని చెప్పి రూ.2-5లక్షలు చేసేవారు. పెళ్లి జరిగిన తర్వాత పెళ్లికూతురు నగలు, ఇతర విలువైన వస్తువులు తీసుకుని పరారయ్యేది ఇది వీళ్ల తంతు.