LPG cylinder Price : గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గిందోచ్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

సామాన్యులకు ఊరట కలిగించే వార్త.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది.. ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గనున్నాయి. ఒక గ్యాస్ బండపై రూ.10 తగ్గనుంది.

LPG cylinder Price : గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గిందోచ్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

Lpg Cylinders To Become Cheaper From April 1

Updated On : March 31, 2021 / 9:46 PM IST

LPG cylinder Price : సామాన్యులకు ఊరట కలిగించే వార్త.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది.. ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గనున్నాయి. ఒక గ్యాస్ బండపై రూ.10 తగ్గనుంది. ఈ మేరకు ఇండియన్‌ ఆయిల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. గురువారం నుంచి పది రూపాయలకు తక్కువగా గ్యాస్‌ సిలిండర్‌ అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతం ఢిల్లీలో ఎల్పీజీ గ్యాస్‌ ధర రూ.819గా ఉంది. కొలకత్తాలో రూ.845, ముంబై రూ.819, చెన్నై రూ.835 ధరలు ఉన్నాయి. 2021 ఏడాదిలో మూడుసార్లు భారీగా గ్యాస్‌ ధరలు పెరిగాయి.

అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతుండడంతో ధరలు తగ్గుతాయని అధికారి తెలిపారు. గత నెలలో గ్యాస్ సిలిండర్ ధర రూ.125 పెరిగింది. ఇప్పుడు ఆ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.10 తగ్గిస్తున్నట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.