Maharashtra CM: తాను మోదీ భక్తుడినని లక్సెంబర్గ్‌ ప్రధాని నాకు చెప్పారు: మహారాష్ట్ర ముఖ్యమంత్రి

‘‘తాను మోదీ భక్తుడినని లక్సెంబర్గ్‌ ప్రధానమంత్రి నాకు చెప్పారు. లక్సెంబర్గ్‌ ప్రధాని నాతో ఫొటో తీసుకున్నారు. దాన్ని మోదీకి చూపించాలని చెప్పారు. జర్మనీ, సౌదీ అరేబియా నుంచి వచ్చిన చాలా మందిని నేను కలిశాను. నేను మోదీ మనిషినని వారికి చెప్పాను’’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు.

Maharashtra CM: తాను మోదీ భక్తుడినని లక్సెంబర్గ్‌ ప్రధాని నాకు చెప్పారు: మహారాష్ట్ర ముఖ్యమంత్రి

Eknath Shinde Moves Resolution On Border Row

Updated On : January 20, 2023 / 9:25 AM IST

Maharashtra CM: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లక్సెంబర్గ్‌ ప్రధానమంత్రి గ్జేవియర్‌ బెటెల్‌ భక్తుడని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఏక్‌నాథ్ షిండే రెండు రోజుల క్రితం భారత్ కు వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ… ‘‘తాను మోదీ భక్తుడినని లక్సెంబర్గ్‌ ప్రధానమంత్రి నాకు చెప్పారు. లక్సెంబర్గ్‌ ప్రధాని నాతో ఫొటో తీసుకున్నారు. దాన్ని మోదీకి చూపించాలని చెప్పారు. జర్మనీ, సౌదీ అరేబియా నుంచి వచ్చిన చాలా మందిని నేను కలిశాను. నేను మోదీ మనిషినని వారికి చెప్పాను’’ అని అన్నారు.

ప్రధాని మోదీ భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పాప్యులర్ అని ఏక్‌నాథ్ షిండే అన్నారు. భారత్ గురించి, మోదీ గురించి ప్రపంచ దేశాల నేతలు ఎన్నో సానుకూల వ్యాఖ్యలు చేశారని చెప్పారు. కాగా, ప్రపంచం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ పట్ల పెట్టుబడిదారులు ఆకర్షితులవుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర వైపునకు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో కుదుర్చుకున్న ఎంవోయూల ద్వారా మహారాష్ట్రలో దాదాపు లక్ష ఉద్యోగాలను సృష్టిస్తున్నామని తెలిపారు.

Husband Wife Dispute: భార్య తనను అడగకుండా స్వెట్టర్ ఉతికిందన్నకోపంతో ఇంటికి నిప్పంటించిన భర్త..