ఆ సీఎంకు కరోనా..కలిసిన వారిలో కలవరం

  • Published By: madhu ,Published On : July 25, 2020 / 12:47 PM IST
ఆ సీఎంకు కరోనా..కలిసిన వారిలో కలవరం

Updated On : July 25, 2020 / 1:23 PM IST

కరోనా ఎవరినీ వదలడం లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా..వైరస్ సోకుతోంది. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. ఇందులో నేతలు, ప్రజాప్రతినిధులున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ కు కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి వైరస్ బారిన పడలేదు. ఈయనే మొదటి వారు.

Corona Virus పరీక్షలు చేయించుకోగా…పాజిటివ్ వచ్చినట్లు సీఎం చౌహాన వెల్లడించారు. కొన్ని రోజులుగా వైరస్ లక్షణాలు కనిపించాయన్నారు. ఇటీవలే తనను కలిసిన వారు, ఉద్యోగులు పరీక్షలు చేయించుకుని..స్వీయ నిర్భందంలోకి వెళ్లాలని సూచించారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. తాను అన్ని మార్గదర్శకాలను, నిబంధనలు పాటిస్తున్నట్లు వెల్లడించారాయన. వైద్యుల సూచన మేరకు నిర్భందంలోకి వెళుతున్నట్లు, రాష్ట్రంలోని పౌరులందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వైరస్ సోకుతుందని, కోవిడ్ వైరస్ నివారించడానికి అన్ని ప్రయత్నలు చేస్తున్నానని రాష్ట్ర ప్రజలకు తెలిపారు. అయినా..ప్రజలు సమస్యలపై తనను కలిసేవారని, చర్చించారని సీఎం చౌహాన్ వెల్లడించారు.

India లో గత 24 గంటల్లో 48 వేల 916 కొత్త కేసులు నమోదయ్యాయి. 2020, జులై 24వ తేదీ శుక్రవారం పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినట్లు చెప్పవచ్చు. ఇక 757 మంది మరణించడంతో మృతుల సంఖ్య 31 వేల 358కి పెరిగింది. మొత్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 13 లక్షల 36 వేల 861కి చేరింది.

యాక్టివ్ కేసుల సంఖ్య 4లక్షల 56వేల 071 ఉన్నాయి. కోలుకున్న వారి సంఖ్య 8లక్షల 49వేల 432 గా ఉంది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని, ప్రస్తుతం అది 2.38శాతంగా ఉందని చెప్పింది.