New Airport : ఉజ్జయినిలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఉజ్జయిని-దేవాస్ మధ్య విస్తరించి ఉన్న 10,000 ఎకరాల భూమిని సేకరించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశించారు....

Chief Minister Mohan Yadav
New Airport : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఉజ్జయిని-దేవాస్ మధ్య విస్తరించి ఉన్న 10,000 ఎకరాల భూమిని సేకరించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశించారు. ప్రతిపాదిత విమానాశ్రయం కనీసం ఐదు రన్‌వేలను నిర్మించాలని నిర్ణయించారు. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మించేలా అతి పెద్ద విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు.
ALSO READ : Enforcement Directorate : భూ కుంభకోణంలో లాలూ భార్య రబ్రీ, ఇద్దరు కూతుళ్లపై ఈడీ ఛార్జ్‌షీట్
దీంతోపాటు ఇండోర్‌లో ప్రస్తుతం ఉన్న దేవి అహల్య విమానాశ్రయాన్ని విస్తరించాలని నిర్ణయించారు. సీఎం మోహన్ యాదవ్ ఆదేశంతో భూసేకరణ, అభివృద్ధి ప్రాజెక్టును వేగవంతం చేసినట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక విధాన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ శుక్లా చెప్పారు.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేవి అహల్య విమానాశ్రయం విస్తరణ కోసం భూమిని తాజాగా సేకరించాలని కోరడంతో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. కొత్త విమానాశ్రయాన్ని నిర్మించినట్లయితే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని సీఎం యాదవ్ చెప్పారు.