ట్రాఫిక్ క్లియర్ చేసిన మంత్రి

  • Published By: venkaiahnaidu ,Published On : September 11, 2019 / 05:03 AM IST
ట్రాఫిక్ క్లియర్ చేసిన మంత్రి

Updated On : September 11, 2019 / 5:03 AM IST

మధ్యప్రదేశ్‌ క్రీడాశాఖ మంత్రిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు సూపర్ సార్ అంటూ ఆయనను పొగిడేస్తున్నారు. హ్యాట్సాఫ్ సార్ అంటూ మెచ్చుకుంటున్నారు. అసలు ఇంతకీ ఆయన ఏం చేశారు?ఎందుకు ఆయనను నెటిజన్లు మెచ్చుకుంటున్నారబ్బా అని అనుకుంటున్నారా?

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గత రాత్రి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఆ సమయంలోనే అటుగా వచ్చిన క్రీడాశాఖ మంత్రి జితూ పట్వారీ ట్రాఫిక్‌ లో చిక్కుకున్నారు. దీంతో ఆయనే స్వయంగా కారు దిగి.. ట్రాఫిక్‌ ను క్లియర్‌ చేశారు. మంత్రి చేసిన ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్న మంత్రికి మరికొందరు సహకరించారు. ట్రాఫిక్‌ క్లియర్‌ కాగానే మంత్రి అక్కడ్నుంచి తన వాహనంలో వెళ్లిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రి గారు చూపిన సామాజిక బాధ్యతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.