Love Jihad: మదరసాలకు లవ్ జిహాద్ లింక్ పెడుతూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీహెచ్పీ నేత సాధ్వి ప్రాచి
“హిందువులు డబ్బు సంపాదన గురించి మాత్రమే ఆలోచిస్తారు, అయితే భారతదేశాన్ని పాలించడం గురించి ఆలోచించే ఒక ప్రత్యేక సంఘం ఉంది. భారతదేశాన్ని పాలించాలనే వారి ఎజెండా వేల సంవత్సరాలుగా ఉంది’’ అని ముస్లింలను ఉద్దేశించి సాధ్వి అన్నారు

Sadhvi Prachi
Madrasas: దేశంలో లవ్ జిహాద్ అంశం ముగియడం లేదు. దీనికి తోడు కొద్ది రోజులుగా మదరసాలు కూడా వివాదంలోకి వచ్చాయి. ఇక తాజాగా ఈ రెండు అంశాలను ఒకదానితో మరొకదానికి లింకు పెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు విశ్వహిందూ పరిషద్ నేత సాధ్వి ప్రాచి. మదర్సాల నుంచే లవ్ జిహాద్ మొదలవుతుందని, మదర్సాలు మూసివేసిన రోజు ‘లవ్ జిహాద్’ ఉనికిలో ఉండదని ఆమె అన్నారు. అదే జరిగితే భారతదేశంలోనే కాకుండా ఏకంగా ప్రపంచం మొత్తంలో శాంతి, సామరస్యం ఉంటుందని ఆమె అన్నారు.
Chhattisgarh Polls: ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ముందు కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం భూపేష్ బాఘేల్
“హిందువులు డబ్బు సంపాదన గురించి మాత్రమే ఆలోచిస్తారు, అయితే భారతదేశాన్ని పాలించడం గురించి ఆలోచించే ఒక ప్రత్యేక సంఘం ఉంది. భారతదేశాన్ని పాలించాలనే వారి ఎజెండా వేల సంవత్సరాలుగా ఉంది’’ అని ముస్లింలను ఉద్దేశించి సాధ్వి అన్నారు. “వాళ్ళేం చేస్తున్నారు? నేషనల్ హైవే మీద పంక్చర్ షాప్ నడిపిస్తారు. కానీ సిటీలో వీధుల్లో పంక్చర్ షాప్ ఎందుకు కనిపించదు?” అని అన్నారు. ముస్లింలు ఒక ఎజెండా ప్రకారం వెళ్తున్నారని, వారి లక్ష్యం ఈ దేశాన్ని పాలించడమేనని, అయితే దాన్ని ఆపాలని సాధ్వి అన్నారు.