Maha Kumbh Mela 2025 : వ్యాపారం @ రూ.3లక్షల కోట్లు..! కుంభమేళాలో రికార్డులు బద్దలు..
కుంభమేళాలో వ్యాపారాలు జరిగిన తీరు ఆశ్చర్యం కలిగించక మానదు.

Maha Kumbh Mela
Maha Kumbh Mela 2025 : కుంభమేళా ఆదాయంలోనూ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే 3 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ శివరాత్రితో ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక జాతర ముగుస్తుంది. ఈ కార్యక్రమం నిర్వహిణతో యూపీ సర్కార్ రికార్డులపై రికార్డులు క్రియేట్ చేసింది. భక్తిపరమైన భావన వ్యాపించడమే కాదు కుంభ్ నగర్ చుట్టుపక్కల గ్రామాలన్నీ సంపద సృష్టలో భాగమయ్యాయి.
యూపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కుంభమేళా.. అద్భుతమైన రికార్డులు సృష్టిస్తోంది. అటు భక్తుల రాక మాత్రమే కాదు ఇటు జరిగిన వ్యాపార విషయంలోనూ కుంభమేళా ఓ కల్పతరువుగా మారిపోయింది. ఈ ఊపులోనే 2030 నాటికి దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం 10 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తుందని అంచనా.
కుంభమేళాలో వ్యాపారాలు జరిగిన తీరు ఆశ్చర్యం కలిగించక మానదు. స్నాన ఘట్టాలకు తీసుకెళ్లేందుకు స్థానిక యువత తమ బైకులను కూడా వాడుతున్నారు. బైక్ పై 400 కిలోమీటర్ల దూరానికి 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇలా స్థానికంగా యువత ఈ నెల రోజులుగా మంచి ఉపాధి పొందారని అనడంలో సందేహం లేదు. ఈ చిన్నాచితకా పనులన్నీ కలిపి లక్ష కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని కుంభ్ నగర్ చుట్టుపక్కల జరిగేలా చేస్తున్నాయి.
Also Read : రికార్డులను బ్రేక్ చేసే రేంజ్‌లో బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఫుల్ డీటెయిల్స్..
కుంభమేళా ప్రారంభానికి ముందు ప్రాథమిక అంచనాల ప్రకారం 40 కోట్ల మది భక్తులు వస్తే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపార లావాదేవీలు జరుగుతాయని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్ అంచనా. కానీ, ఇప్పటికే భక్తుల సంఖ్య 65 కోట్లను దాటేసింది. ఈ నేపథ్యంలో ముగింపు రోజుకు దాదాపు 75 కోట్ల మంది ఈ మహాకుంభమేళాలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. దీంతో 3 లక్షల కోట్లకుపై వ్యాపార టర్నోవర్ జరుగుతుందని ట్రేడ్ బాడీ చెబుతోంది.