Rooster Death : నా కోడిని చంపేసారు.. పోస్ట్ మార్టం చేయండి.. మాజీ ఎమ్మెల్యే కొడుకు డిమాండ్
నాకోడిని ఎవరో చంపేసారు అంటూ మాజీ ఎమ్మెల్యే కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దానికి పోస్ట్ మార్టమ్ చేయాలని డిమాండ్ చేసిన వింత ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది.

Former Mla Son Complaint On His Chicken Death
former mla son complaint on his chicken death : నాకోడిని ఎవరో చంపేశారు. విషం పెట్టి మరీ చంపేశారు. నా కోడికి పోస్ట్ మార్టమ్ చేయండీ..నా కోడిని చంపినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.మహారాజ్‌గంజ్ జిల్లాలోని సింధూరియన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్ర కళ్యాణ్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ వింత ఫిర్యాదు వివరాల్లోకి వెళితే..
Read more : నా చెట్టు పోయింది సార్..పోలీసులకు 6th క్లాస్ పిల్లాడి ఫిర్యాదు..
సింధూరియన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న మాజీ ఎమ్మెల్యే దుఖీ ప్రసాద్ కుమారుడు రాజ్‌కుమార్ భారతి శనివారం (సెప్టెంబర్ 12.2021) పోలీస్ స్టేషన్‌లో ఒక విచిత్రమైన ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ అయ్యారు. ఆ తరువాత తేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మీరిచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేపడతామని తెలిపారు.
Read more : Women Catwalks : గుంతల రోడ్లపై క్యాట్ వాక్ చేసిన మహిళలు
ఫిర్యాదులో రాజ్ కుమార్ భారతి తన కోడిపుంజుకు ఎవరో విషమిచ్చి చంపేసినట్లు ఆరోపించారు. మృతిచెందిన తన కోడికి వెంటనే పోస్ట్‌మార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఉదంతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చిలుకలు, పావురాలు, కోళ్లు వంటివి పెంచడం తనకు చాలా ఇష్టమని..అలా తాను ఎంతో ఇష్టంగా పెంచుకునే ఓ కోడిపుంజు చనిపోయిందనీ..దానికి ఎవరో విషయం పెట్టి చంపేశారని అనుమానంగా ఉందని అందుకే పోలీసు కంప్లైంట్ ఇచ్చానని తెలిపాడు మాజీ ఎమ్మెల్యే కొడుకు రాజ్ కుమార్ భారతి.