Maharashtra : నా తండ్రి రోజు తాగుతున్నాడు..గ్రామసభలో ఫిర్యాదు చేసిన 13 ఏళ్ల బాలుడు
తండ్రి చేత తాగుడు ఎలా మానిపించాలా అని అంకుశ్ ఆలోచించసాగాడు. మద్యం వల్ల కలిగే దుష్ప్రభావాలను గ్రామమంతా ప్రచారం చేశాడు. కానీ..పరిస్థితిలో మార్పు...

No Liquor
Maharashtra 13 Year Old Son : మద్యం కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది. మద్యానికి బానిసైన కొంతమంది చేస్తున్న వ్యవహారంతో కుటుంబసభ్యులు తీరని సమస్యలను ఎదుర్కొంటున్నారు. క్షణికావేశంలో మద్యం బాబులు దారుణాలకు తెగబడుతున్నారు. ఫలితంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఏ పని చేయక..డబ్బులు ఇవ్వాలని ఇంట్లో పని చేస్తున్న వారిని అడుగుతుండడంతో వారి కుటుంబాల్లో నిత్యం గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. వారి చేత మద్యాన్ని మానిపించాలని కుటుంబసభ్యులు ప్రయత్నించి విఫలమౌతున్నారు. తాజాగా..13 ఏళ్ల బాలుడు వినూత్న ప్రయత్నం చేశాడు. తండ్రిపై గ్రామసభలో ఫిర్యాదు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆ బాలుడిని అందరూ ప్రశంసలతో ముంచెత్తున్నారు. మళ్లీ మద్యం ముట్టొద్దంటూ గ్రామసభ హుకుం జారీ చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
Read More : Amazon Sale Offers : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్ ఫోన్లపై 40శాతం ఆఫర్.. 4 రోజులు మాత్రమే!
యావత్మాల్ జిల్లా ఆర్ణీ తాలుకాలోని లోన్ బెహెల్ లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. 13 ఏళ్ల వయస్సున్న అంకుశ్ రాజు అడె…ఏడో తరగతి చదువుతున్నాడు. అంకుశ్ తండ్రికి కొంత సాగు భూమి ఉంది. కానీ..అతను మద్యానికి బానిసయ్యాడు. దీంతో తల్లి కూరగాయలు విక్రయిస్తూ..కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. కుటుంబం ఆర్థికంగా చితికిపోతుండడంతో అంకుశ్ కూడా సైకిల్ పై కూరగాయలను విక్రయించడం మొదలపెట్టాడు. ఇతనికి సోదరి కూడా ఉంది.
Read More : Microsoft Tab: భారత్ లో Surface Pro X ను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్
తండ్రి చేత తాగుడు ఎలా మానిపించాలా అని అంకుశ్ ఆలోచించసాగాడు. మద్యం వల్ల కలిగే దుష్ప్రభావాలను గ్రామమంతా ప్రచారం చేశాడు. కానీ..పరిస్థితిలో మార్పు కనిపించలేదు. చివరికి గ్రామసభకు చేరుకున్నాడు. అక్కడ తన కుటుంబం, తండ్రి మద్యానికి బానిస..తదితర వివరాలను గ్రామసభ్యుల దృష్టికి తీసుకొచ్చాడు. అతని ఆలోచనను మెచ్చుకున్న సర్పంచ్..వెంటనే ఆదేశాలు జారీ చేశారు. మద్యం తాగవద్దని హుకుం జారీ చేశారు. అంకుశ్ కి సన్మానం చేశారు. గ్రామ సభ ఇచ్చిన ఆదేశాలతో అంకుశ్ చాలా సంతోషం వ్యక్తం చేశాడు.