CCTV Camera : టమాటా పొలంలో సీసీటీవీ కెమెరాలు…మహారాష్ట్ర రైతు ప్రయోగం

టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్న కారణంగా మహారాష్ట్రకు చెందిన ఓ రైతు తన పొలంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది.....

CCTV Camera : టమాటా పొలంలో సీసీటీవీ కెమెరాలు…మహారాష్ట్ర రైతు ప్రయోగం

CCTV Camera In Farm

Updated On : August 8, 2023 / 3:09 PM IST

CCTV Camera In Farm : టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్న కారణంగా మహారాష్ట్రకు చెందిన ఓ రైతు తన పొలంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. దేశవ్యాప్తంగా టమాటా కిలో ధర రూ.100 నుంచి 200 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాపూర్ బంజర్‌లో దొంగలు దాడి చేసి టమాటాలను ఎత్తుకెళ్లడంతో తన పొలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు రైతు తెలిపారు. (Maharashtra Farmer Installs CCTV Camera In Farm)

Chhattisgarh village : పిడుగులు పడకుండా ఆవుపేడ పూత..గ్రామంలో ఇళ్ల గోడలపై వింత డిజైన్లు

25 కిలోల టమాటాల బాక్సును మూడు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. దీంతో అత్యంత డిమాండ్ ఉన్న టమాటాలు చోరీ కావడం తాను భరించలేక పోయానని అందుకే పొలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశానని రైతు శరద్ రావ్టే చెప్పారు. (To Keep An Eye On Tomatoes) తన 5 ఎకరాల పొలంలో ఎకరంన్నరలో టమాటా వేశానని చెప్పారు. టమాటాల విక్రయంతో తనకు 6 నుంచి 7 లక్షల రూపాయల ఆదాయం సులభంగా వస్తుందని శరద్ రావ్టే పేర్కొన్నారు.

Thousands of Flight Canceled : యూఎస్‌లో భారీ తుపాన్…వేలాది విమాన సర్వీసుల రద్దు

10 రోజుల క్రితం గంగాపూర్ తాలూకాలోని తన పొలంలో 25 కిలోల టమోటాలు చోరీ అయ్యాయని, దీంతో తాను పండని మిగిలిన టమాటాల పంటను రక్షించుకోవడానికి రూ.22,000 విలువైన సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశానని రైతు వివరించారు. సీసీ కెమెరా సౌరశక్తితో నడుస్తుందని, దీని విద్యుత్ సరఫరా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతు తెలిపారు. తన ఫోన్‌లో ఎక్కడ ఉన్నా టమాట పొలం విజువల్స్‌ని తనిఖీ చేసుకోగలనని శరద్ రావ్టే చెప్పారు.