రెండుగా చీలిపోయిన ఎన్సీపీ..30 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు!

  • Published By: madhu ,Published On : November 23, 2019 / 05:49 AM IST
రెండుగా చీలిపోయిన ఎన్సీపీ..30 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు!

Updated On : November 23, 2019 / 5:49 AM IST

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్టు చోటు చేసుకుంది. కాంగ్రెస్, శివసేన పార్టీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది బీజేపీ. అక్కడ ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019, నవంబర్ 23వ తేదీ శనివారం ఉదయం సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. కొద్దిసేపటికే మరో ట్విస్టు చోటు చేసుకుంది. ఎన్సీపీ రెండుగా చీలిపోయింది. అజిత్ పవర్ వర్గం బీజేపీకి సపోర్టు చేసింది.

ఫడ్నవీస్‌కు అనుకూలంగా 30 మంది ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చారు. 2019, నవంబర్ 22వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఫడ్నవీస్, అజిత్ పవర్‌లు కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరిగాయి. రాత్రికి రాత్రే వేగంగా పరిణామాలు మారిపోయాయి. 2019, నవంబర్ 23వ తేదీ శనివారం ఉదయం కేంద్రానికి గవర్నర్‌కు నివేదిక పంపించడం..ఉదయం 5.47 గంటలకు రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. అనంతరం సీఎంగా ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. 

170 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని మహారాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. సంఖ్యాపరంగా 145 మేజిక్ ఫిగర్ చేరుకోవాల్సి ఉంటుంది. బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా..ఎన్సీపీ 54 స్థానాల్లో గెలుపొందింది. 30 మంది బీజేపీకి ఎన్సీపీ ఎమ్మెల్యేలు మద్దతివ్వడంతో పార్టీ రెండుగా చీలినట్లైంది. కానీ బీజేపీ వైపుకు ఎంత మంది వస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బల నిరూపణకు నవంబర్ 30వ తేదీ వరకు గడువు ఇచ్చారు గవర్నర్. 

ఇదిలా ఉంటే…అజిత్ పవర్ వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చారని, ఎన్సీపీకి ఎలాంటి సంబంధం లేదని శరద్ పవార్ తేల్చిచెప్పారు. శివసేన, కాంగ్రెస్ పార్టీలతో చర్చలు జరుపుతూ శరద్ పవార్ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. కానీ అజిత్ పవార్ వేసిన ఎత్తుగడతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. మరోవైపు..శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌లు మీడియా ముందుకు రానున్నారు. 
Read More : ఫిర్ ఏక్ బార్ ఫడ్నవీస్ సర్కార్