Mallikarjun Kharge : వచ్చే ఏడాది ఎర్రకోటపై కాకుండా మోదీ తన ఇంటి వద్ద జెండా ఎగురవేస్తారు : మల్లికార్జున ఖర్గే

మరోవైపు ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కాలేకపోవడానికి గల కారణాలను మల్లికార్జన ఖర్గే వివరించారు. తనకు కంటి సంబంధిత సమస్యలు ఉన్నాయని అందువల్లనే ప్రధాని ప్రసంగానికి హాజరు కాలేకపోయానని చెప్పారు.

Mallikarjun Kharge : వచ్చే ఏడాది ఎర్రకోటపై కాకుండా మోదీ తన ఇంటి వద్ద జెండా ఎగురవేస్తారు : మల్లికార్జున ఖర్గే

Mallikarjun Kharge (1)

Updated On : August 15, 2023 / 2:54 PM IST

Mallikarjun Kharge – PM Narendra Modi : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఎర్రకోట వద్ద కలుద్దాం అన్న మోదీ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ప్రధాని వ్యాఖ్యలు ఆయన అహంకారాన్ని చూపిస్తున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది ఎర్రకోటపై కాకుండా మోదీ తన ఇంటి వద్ద జెండా ఎగురువేస్తారని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది మళ్లీ ఆగస్టు15న వస్తానని, ఎర్రకోటపై జెండా ఎగురవేస్తానని చెప్పారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే స్పందించారు. ప్రధాని మోదీ వచ్చే ఏడాది జెండా ఎగురవేస్తారు కానీ, అది ఆయన ఇంటిపైనే అని అన్నారు.  2024లో మరోసారి జెండా ఎగురవేస్తానని 2023లోనే చెప్పడం మోదీ అహంకారాన్ని చూపిస్తోందని పేర్కొన్నారు.

Rahul Gandhi : ప్రతి భారతీయుడి గొంతుగా భారత్ మాత…రాహుల్ గాంధీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మరోవైపు ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కాలేకపోవడానికి గల కారణాలను మల్లికార్జన ఖర్గే వివరించారు. తనకు కంటి సంబంధిత సమస్యలు ఉన్నాయని అందువల్లనే ప్రధాని ప్రసంగానికి హాజరు కాలేకపోయానని చెప్పారు. అంతేకాకుండా ప్రోటోకాల్ ప్రకారం ఉదయం 9.20 గంటలకుతన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశానని తెలిపారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి జెండాను ఎగురవేశానని చెప్పారు. దానికి తోడు భారీ బందోబస్తు ఉందన్నారు. భద్రతా దళాలు ప్రధానిని తప్ప ఎవరినీ ముందుకు వెళ్లనివ్వలేదని వెల్లడించారు. దాంతో సమయానికి ఎర్రకోట వద్దకు రాలేనని భావించానని తెలిపారు. భద్రతా కారణాలు, సమయాభావం కారణంగా ఎర్రకోట దగ్గరికి రాకపోవడమే మంచిదని అనుకున్నట్లుగా వెల్లడించారు.