Mamata-Adani : అదానీతో మమత భేటీ
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం బిజనెస్ టైకూన్ గౌతమ్ అదానీతో సమావేశమయ్యారు. కోల్ కతాలోని రాష్ట్ర సెక్రటరేయట్ నబన్నాలో మమతాబెనర్జీని కలిశారు గౌతమ్ అదానీ. పశ్చిమ బెంగాల్‌లో

Mamata Adani
Mamata-Adani : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం బిజనెస్ టైకూన్ గౌతమ్ అదానీతో సమావేశమయ్యారు. కోల్ కతాలోని రాష్ట్ర సెక్రటరేయట్ నబన్నాలో మమతాబెనర్జీని కలిశారు గౌతమ్ అదానీ. పశ్చిమ బెంగాల్‌లో అదానీ కంపెనీల పెట్టుబడి అవకాశాల గురించి ఇద్దరూ చర్చించారు. దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం జరిగింది.
మమతతో భేటీ అనంతరం ట్వీట్ చేసిన అదానీ..”గౌరవనీయులైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవడం ఆనందంగా ఉంది. వివిధ పెట్టుబడి అవకాశాలు మరియు పశ్చిమ బెంగాల్ యొక్క అద్భుతమైన సమర్థత గురించి చర్చించాం. ఏప్రిల్ 2022లో బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ (BGBS)కి హాజరయ్యేందుకు ఎదురుచూస్తున్నాను”అని ట్వీట్ లో అదానీ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌లో మమతా బెనర్జీని కలిసినప్పుడు తీసుకున్న ఫొటోను షేర్ చేశారు.
అయితే మమతా బెనర్జీని అపర కుబేడరుడు గౌతమ్ అదానీ కలుసుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను భారతీయ జనతా పార్టీ బీ-టీం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
కాగా,తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సృష్టంగా అర్థమవుతోంది. బీజేపీకి ధీటైన ప్రధాన విపక్ష పార్టీగా ఎదగాలనే స్పష్టమైన లక్ష్యంతో పలు రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుండి అనేక మంది నాయకులను చేర్చుకుంటూ పార్టీని విస్తరిస్తోంది టీఎంసీ. ఈ క్రమంలోనే మమత ఇటీవల పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ..ఆయా రాష్ట్రాల్లో టీఎంసీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా మంగళవారం,బుధవారం రెండు రోజులపాటు ముంబైలో పర్యటించిన మమతా బెనర్జీ..ఎన్సీపీ అధినేత శరద్ పవార్,మహారాష్ట్ర మంత్రి ఆదిత్యఠాక్రేలతో పాటు పలువురు నేతలని కలిశారు. బుధవారం శరద్ పవార్ ని కలిసిన అనంతరం దేశంలో యూపీఏ లేదు,ప్రత్యామ్నాయం అవసరమంటూ మమత చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.
ALSO READ Covid Positive : సూర్యాపేట DMHO కుటుంబంలో ఆరుగురికి కరోనా