ప్రియాంక గాంధీ తరఫున ప్రచారం చేయనున్న మమతా బెనర్జీ?

Mamata Banerjee: ఇండియా కూటమికి ఎన్నికల్లో భారీగా సీట్లు రావడంతో ఆయా పార్టీలో మరింత విశ్వాసం పెరిగింది

ప్రియాంక గాంధీ తరఫున ప్రచారం చేయనున్న మమతా బెనర్జీ?

కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఆమె తరఫున పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి.

ఇండియా కూటమికి ఎన్నికల్లో భారీగా సీట్లు రావడంతో ఆయా పార్టీలో మరింత విశ్వాసం పెరిగింది. ఈ నేపథ్యంలోనే వయనాడ్ లో కాంగ్రెస్ తరఫున మమతా బెనర్జీ ప్రచారం చేసే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది. గత ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రియాంక గాంధీ పోటీ చేయాలని మమతా బెనర్జీ గత ఏడాది డిసెంబర్‌లో సూచించారు.

కాగా, ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్‌, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ రెండింట్లోనూ రాహుల్ గెలుపొందారు. వయనాడ్ స్థానానికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారని ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ బరిలో ప్రియాంక పోటీ చేస్తారని చాలా మంది భావించినప్పటికీ ఆమె పోటీ చేయలేదు.

Also Read: పేపర్ లీక్‌పై కొత్త చట్టం.. ఇకపై నేరానికి పాల్పడితే.. రూ. 1 కోటి జరిమానా.. 10 ఏళ్ల జైలు శిక్ష!