Uttar Pradesh : గుడిలో నమాజ్ చేసిన వ్యక్తి అరెస్టు

ఈ ఘటనపై ఆలయ కమిటీ ఆఫీస్ బేరర్ సత్యనారాయణ్ అగర్వాల్ కొత్వాలీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని హాపూర్ ఎస్పీ అభిషేక్ వర్మా తెలిపారు.

Uttar Pradesh : గుడిలో నమాజ్ చేసిన వ్యక్తి అరెస్టు

man namaz

Updated On : June 11, 2023 / 11:28 AM IST

Man Namaz Temple : ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ లో గుడిలో నమాజ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున హాపూర్ లోని ఛండీ ఆలయంలో అమ్మవారికి తొలి పూజ జరుగుతోంది. భక్తులతోపాటు ఓ వ్యక్తి ఆలయంలోకి వచ్చాడు.

అందరూ హారతి కోసం వేచి ఉన్నారు. అదే సమయంలో ఆలయ ఆవరణలో తనతో తెచ్చుకున్న వస్త్రాన్ని నేలపై పరిచి ఓ వ్యక్తి నమాజ్ చేస్తున్నాడు. దీంతో అతడిని భక్తులు అడ్డుకున్నారు. పూజారులు, ఆలయ అధికారులు అతడిని గుడిలో నుంచి బయటకు పంపించి వేశారని పోలీసులు పేర్కొన్నారు.

MLC Mohammad Rahutullah : బైక్ ను ఢీకొట్టిన ఎమ్మెల్సీ మహ్మద్ రహుతుల్లా కారు.. ఒకరు మృతి

ఈ ఘటనపై ఆలయ కమిటీ ఆఫీస్ బేరర్ సత్యనారాయణ్ అగర్వాల్ కొత్వాలీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని హాపూర్ ఎస్పీ అభిషేక్ వర్మా తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతడిని అన్వర్ గా గుర్తించామని పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేశామన్నారు.

కాగా, పట్టణంలోని ఆలయాల్లో భద్రత పెంచాలని హాపూర్ ఎమ్మెల్యే విజయ్ పాల్ అధతి అధికారులను కోరారు. ఇక నమాజ్ చేయడంతో ఆలయాన్ని గంగా జలంతో రెండు సార్లు శుద్ధి చేశారు.