Delhi airport: ఢిల్లీ ఎయిర్‌‌పోర్టులో బహిరంగ మూత్ర విసర్జన చేసిన వ్యక్తి.. అరెస్టు

ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్టు, టెర్మినల్ 3లో ఒక ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. తోటి ప్యాసింజర్లు చూస్తుండగానే, బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు.

Delhi airport: ఢిల్లీ ఎయిర్‌‌పోర్టులో బహిరంగ మూత్ర విసర్జన చేసిన వ్యక్తి.. అరెస్టు

Updated On : January 11, 2023 / 3:50 PM IST

Delhi airport: విమానాల్లో ప్రయాణికుల అనుచిత, అభ్యంతరకర ప్రవర్తనకు సంబంధించి అనేక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఎయిర్‌‌పోర్టులో అభ్యంతరకర ఘటన చోటు చేసుకుంది.

Golden Globe Awards: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రారంభించారు: ఉక్రెయిన్ అధ్యక్షుడు

అది కూడా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కావడం గమనార్హం. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్టు, టెర్మినల్ 3లో ఒక ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. తోటి ప్యాసింజర్లు చూస్తుండగానే, బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు. తోటి ప్రయాణికులపై కూడా మూత్రం పోస్తూ ఇబ్బందిపెట్టాడు. డిపార్చర్ గేట్ వద్ద ఈ నెల 8న బిహార్‌‌కు చెందిన జౌహర్ అలీఖాన్ ఈ చర్యకు పాల్పడ్డాడు.

Rahul Sipligunj : నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. అంతర్జాతీయ స్టేజిపై నా పేరు చెప్పడం గర్వంగా ఉంది..

జౌహర్ ఢిల్లీ నుంచి సౌదీ అరేబియా వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌‌పోర్టుకు వచ్చాడు. ఈ ఘటనపై ప్రయాణికులు ఎయిర్‌‌పోర్టు అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తర్వాత నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. జౌహర్ మద్యం మత్తులో ఈ చర్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలే ఎయిర్ ఇండియా విమానంలో ఒక వ్యక్తి మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే అలాంటి మరో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.