Golden Globe Awards: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రారంభించారు: ఉక్రెయిన్ అధ్యక్షుడు

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రారంభించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ గుర్తు చేశారు. హాలీవుడ్ 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో జెలెన్ స్కీ వర్చువల్ పద్ధతిలో ప్రసంగించారు. ఆయన ప్రసంగం లైవ్ లో ప్రసారమైంది. రష్యాతో చేస్తోన్న యుద్ధంలో పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతున్నాయని, మూడో ప్రపంచ యుద్ధం ఉండబోదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. 

Golden Globe Awards: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రారంభించారు: ఉక్రెయిన్ అధ్యక్షుడు

Golden Globe Awards: గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రారంభించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ గుర్తు చేశారు. హాలీవుడ్ 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో జెలెన్ స్కీ వర్చువల్ పద్ధతిలో ప్రసంగించారు. ఆయన ప్రసంగం లైవ్ లో ప్రసారమైంది. రష్యాతో చేస్తోన్న యుద్ధంలో పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతున్నాయని, మూడో ప్రపంచ యుద్ధం ఉండబోదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు.

‘‘మొదటి ప్రపంచ యుద్ధంలో లక్షలాది మంది ప్రజలు చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా కోట్ల మంది మృతి చెందారు. అయితే, మూడో ప్రపంచ యుద్ధం ఉండదు. రష్యా ఆక్రమణను ఈ స్వేచ్ఛా ప్రపంచ సాయంతో ఉక్రెయిన్ అడ్డుకుంటుంది. 2023లోకి ప్రవేశించాం. ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధం ఇంకా ముగియలేదు. అయితే, అదృష్టవశాత్తూ పరిస్థితులు మాకు అనుకూలంగా మారాయి’’ అని జెలెన్ స్కీ చెప్పారు.

‘‘గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రత్యేక సమయంలో (1943 సంవత్సరంలో) ప్రారంభించారు. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం ఇంకా ముగియలేదు. అయితే, ఎవరు గెలుస్తారన్న విషయంపై మాత్రం అందరికీ స్పష్టత వచ్చింది’’ అని జెలెన్ స్కీ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ స్వాతంత్ర్యానికి మద్దతు తెలుపుతున్న వారికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు.

స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, జీవించే హక్కు, ప్రేమించే హక్కు కోసం అందరమూ చేస్తున్న పోరాటంలో ఐక్యత సాధిస్తున్నామని చెప్పారు. స్వేచ్ఛాయుత ప్రపంచాన్ని నిర్మిద్దామని, ఉక్రెయిన్ విజయం సాధించినరోజు అందరూ తమకు మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నానని తెలిపారు.

Guinness World Record : భారతీయుల ఘనత..73 గంటల్లో 7 ఖండాల్లో ప్రయాణించి గిన్నిస్ రికార్డ్