ఎరక్కపోయి..ఇరక్కపోయాడు : చిన్నోడికి చిలుక కష్టాలు

ముద్దుముద్దుగా ఉండే రామచిలుక అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.పిల్లలు నుంచి పెద్దలు వరకు అందరూ చిలుకలను ఇష్టపడేవారే.

  • Published By: venkaiahnaidu ,Published On : March 7, 2019 / 03:44 AM IST
ఎరక్కపోయి..ఇరక్కపోయాడు : చిన్నోడికి చిలుక కష్టాలు

ముద్దుముద్దుగా ఉండే రామచిలుక అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.పిల్లలు నుంచి పెద్దలు వరకు అందరూ చిలుకలను ఇష్టపడేవారే.

ముద్దుముద్దుగా ఉండే రామచిలుక అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.పిల్లలు నుంచి పెద్దలు వరకు అందరూ చిలుకలను ఇష్టపడేవారే. అలాంటి చిలుక మన ఇంటి పెర్టోని జామ చెట్టుపైనో..లేక మరో చెట్టుపైనో వాలినప్పుడు దాన్ని పట్టుకుని ముద్దు చేయాలని చాలా మంది ట్రై చేస్తుంటారు. అది దొరక్కుండా ఎగిరిపోతే..పోయిందిలే కదా అని వదిలేస్తాం. అయితే మనోడు మాత్రం చిలుక కోసం ఏకంగా 40అడుగుల ఎత్తు ఉన్న చెట్టు ఎక్కి..చెయ్యి విరగ్గొట్టుకొని…చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న చందంగా బయటపడ్డాడు. చిలుక కోసం చిన్నోడు పడ్డ కష్టాలు చూసి స్థానికులు  తెగ నవ్వుకున్నారు. ఓరి ఈడి ఏశాలో అంటూ ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు.
Also Read: అంతేగా…అంతేగా : ఒక్క భారత్ లోనే ఇంటర్నెట్ చీఫ్

మంగళవారం(మార్చి-5,2019) ఉదయం 8గంటల సమయంలో జార్ఖండ్‌లోని గధ్వాకు చెందిన బబ్లూ అనే వ్యక్తికి  ఓ  చిలుక కనిపించింది. దాన్ని చూసి ముచ్చటపడ్డ బబ్లూ ఎలాగైనా దాన్ని పట్టుకోవాలనుకున్నాడు. అయితే తుర్రుమంటూ దగ్గర్లోని ఓ చెట్టు తొర్రలోకి అది వెళ్లిపోయింది. దీంతో ఎలాగైనా చిలుకను పట్టుకోవాలనుకున్న బబ్లూ ఎంత ఎత్తు ఉందో కూడా గమనించకుండా గబగబామంటూ 40 అడుగుల ఎత్తు ఉన్న చెట్టును ఎక్కేశాడు.

చిలుక దూరి ఉన్న తొర్రలో చెయ్యి పెట్టాడు. అయితే చేతికి చిలుకు చిక్కకపోగా..చెయ్యి అందులో ఇరుక్కుపోయింది. దీంతో బబ్లూ గట్టిగా చేతిని లాగే ప్రయత్నం చేయడంతో బ్యాలెన్స్ కోల్పోయి కొమ్మ నుంచి కిందకు జారాడు. అదృష్టం కొద్ది కిందపడకుండా కొమ్మ భాగాన్ని పట్టుకొని గాల్లో వేలాడుతూ కన్పించాడు. చెట్టుకు వేలాడుతున్న బబ్లూని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చివరకు క్రేన్‌ సహాయంతో బబ్లూను కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. చెట్టు తొర్ర నుంచి చేతిని లాగే క్రమంలో బబ్లూ చేతి మణికట్టు విరిగినట్లు డాక్టర్లు తెలిపారు. ఓరి ఈడి ఏశాలో అంటూ స్థానికులు ఫన్నీగా బబ్లూపై సెటైర్లు వేస్తున్నారు. పాపం ఎరక్కపోయి..ఇరక్కపోయాడంటూ సోషల్ మీడియా వేదికగా బబ్లూపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: తమిళ మంత్రి సంచలన వ్యాఖ్యలు : అమ్మను.. హల్వా పెట్టి చంపేశారు