Shramik trainలో సీటు దొరకలేదని కారు కొన్నాడు

  • Published By: Subhan ,Published On : June 3, 2020 / 09:41 AM IST
Shramik trainలో సీటు దొరకలేదని కారు కొన్నాడు

Updated On : June 3, 2020 / 9:41 AM IST

మూడు రోజులుగా ప్రయత్నించినా శ్రామిక్ స్పెషల్ టైన్ లో తనకు, తన కుటుంబానికి టిక్కెట్ బుక్ చేసుకోవడం కుదరలేదు. దీంతో ఘాజియాబాద్‌లో ఇరుక్కుపోయిన ఆ వ్యక్తి ఇంటికి తిరిగి వచ్చేందుకు కారు కొనుక్కున్నాడు. పెయింటర్ గా పనిచేసే లల్లాన్.. అతను దాచుకున్న డబ్బు మొత్తం వెచ్చించి సెకండ్ హ్యాండ్ కారు కొనగలిగాడు. బ్యాంకులో దాచుకున్న రూ.1.9లక్షల డబ్బును విత్ డ్రా చేశాడు. గోరఖ్‌పూర్‌లోని ఇంటికి చేరుకున్నాడు. 

లాక్‌డౌన్ తర్వాత పరిస్థితులు చక్కబడతాయని అనుకున్నా.  లాక్‌డౌన్ పొడిగిస్తూ పోతుంటే.. నేను నా కుటుంబం సొంతూరికి వెళ్లిపోవడమే సేఫ్ అనుకున్నాం. అందుకోసం తీవ్రంగా ప్రయత్నించాం. కానీ, కుదరలేదు. బస్సుల్లో వెళ్లాలంటే గుంపులుగుంపులుగా ఉండే జనంతో వీలుకాలేదు. ఒకవేళ అలా వెళ్లినా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ. 

సోషల్ డిస్టన్స్ పాటిస్తూ ఇంటికి వెళ్లడానికి ట్రైన్ ఒక్కటే సరైన మార్గం అని ప్రయత్నించాడు. మూడు రోజుల తర్వాత కారు కొనుక్కుంటేనే ఇంటికి వెళ్లగలమని ఫిక్సయ్యాడు. నా సేవింగ్స్ మొత్తం ఖర్చు పెట్టి నా కుటుంబం సంతోషంగా ఉంచగలిగాను. మే29న ఘాజియాబాద్ నుంచి వెళ్లిన లల్లాన్ ఫ్యామిలీ బాగానే ఉన్నారు. వారందరూ ఇప్పుడు హోం క్వారంటైన్ లో ఉన్నారు. 

ప్రస్తుతం సొంతూరిలోనే ఏదైనా పనికోసం ప్రయత్నిస్తున్నానని దొరికితే ఇక్కడి నుంచి వెళ్లనని లల్లాన్ అన్నాడు. 

Read: నిసర్గ ఎఫెక్ట్ : 31 విమానాలు రద్దు..స్పెషల్ ట్రైన్స్ రీ షెడ్యూల్