బంజారాహిల్స్‌లో విదేశాల నుంచి వచ్చిన హైదరాబాదీని బలవంతంగా గృహ నిర్భందం చేసిన అపార్ట్‌మెంట్ వాసులు

బంజారాహిల్స్‌లో విదేశాల నుంచి వచ్చిన హైదరాబాదీని బలవంతంగా గృహ నిర్భందం చేసిన అపార్ట్‌మెంట్ వాసులు

Updated On : March 21, 2020 / 1:35 PM IST

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన హైదరాబాద్ వ్యక్తిని బలవంతంగా గృహ నిర్భందం చేశారు అపార్ట్‌మెంట్ వాసులు. అతను 14రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండగా మధ్యలోనే బయటకు వెళ్లేందుకు సిద్ధం అవడంతో ఇంట్లో బంధించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. బంజారా హిల్స్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కళింగ రావుకు విషయం తెలియడంతో ఘటనాస్థలానికి వచ్చారు. 

ఆ వ్యక్తికి అపార్ట్‌మెంట్లో ఉంటున్న మిగిలిన వారికి వాదన జరిగింది. అతనికి కరోనా ఉన్నట్లు అనుమానించిన పొరుగువారు ఇంట్లోనే ఉండాలని బంధించారు. వారికి మేం చెప్పాం. ఇలాంటి పనులు చేయొద్దని ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఇంట్లో బంధించినప్పుడు అతను ట్వీట్ ద్వారా విషయాన్ని బయటపెట్టి కాసేపటిలోనే డిలీట్ చేశాడు. 

‘మా బిల్డింగ్ లో ఉంటున్న వారు నన్ను బయట నుంచి బంధించారు. వారంతా నాకు కరోనా ఉందనుకుంటున్నారు. కానీ, నాకు అలాంటి లక్షణాలేమీ లేవు’ అని ఆయన అన్నాడు. విదేశాల నుంచి వచ్చిన వారిని 14రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ వ్యక్తి కూడా క్వారంటైన్ లో నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్నట్లు స్థానికులు భావించారు. 

శనివారం ఉదయం దుబాయ్ నుంచి ముంబై అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తి.. ఎల్బీ నగర్‌లో బస్సు ఎక్కుతుండగా అధికారులు గుర్తించి అడ్డుకున్నారు. ముంబైలోనే అతనికి కరోనా ఉందని తెలిసి చికిత్స అందిస్తుండగా పారిపోయినట్లు అధికారులు తెలిపారు. క్వారంటైన్‌లో ఉండాలనే సూచనలు పాటించకుండా దేశంలో చాలా మంది తిరుగుతున్నట్లు రిపోర్టులు చెబుతూనే ఉన్నాయి. 

తెలంగాణ పోలీసులు, డాక్టర్లు, పంచాయత్, వార్డు మెంబర్లను తీసుకుని, రెవెన్యూ, మునిసిపల్ అధికారులతో పాటు ఇంటింటికి వెళ్లి కరోనా లక్షణాలు ఉన్నాయేమోనని పర్యవేక్షిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 150టీంలు విదేశీ పర్యాటకుల ఇళ్లపై సోదాలకు సిద్ధమైంది. ఇటీవల దుబాయ్, ముంబై లలో ప్రయాణించిన వ్యక్తికి కరోనా సోకినట్లు గుర్తించారు. శుక్రవారం ముగ్గురు, ఇద్దరు ఇండోనేషియా, భారతీయురాలైన ఓ మహిళ చనిపోయారు.