అబ్బాయి పరార్: పోలీసులు ICUలో అమ్మాయితో పెళ్లి చేశారని

  • Published By: veegamteam ,Published On : December 6, 2019 / 09:58 AM IST
అబ్బాయి పరార్: పోలీసులు ICUలో అమ్మాయితో పెళ్లి చేశారని

Updated On : December 6, 2019 / 9:58 AM IST

మహారాష్ట్రాలో సూరజ్‌ నలవాడే అనే ఓ యువకుడు ఓ యువతిని ప్రేమ పేరుతో దారుణంగా మొసం చేశాడు. ఉన్నట్టుండి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనేసరికి తప్పించుకున్నాడు. దీంతో ఆ యువతి వెంటనే సూసైడ్  చేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణే జిల్లాలో గురువారం (డిసెంబర్ 5, 2019)న చోటు చేసుకుంది. 

వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఆ యువకుడు తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మొసం చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన బాధితురాలు నవంబర్‌ 27న పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రిలో చేర్పించారు.

ఇక అతన్ని నమ్మి లాభం లేదని ఆ యువతి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఆ యువకుడిని యువతి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి తీసుకువచ్చారు. నిన్న ICUలోనే యువతితో బలవంతంగా పెళ్లి జరిపించారు. పోలీసుల సమక్షంలోనే ప్రేమికులు దండలు మార్చుకున్నారు. అయితే పెళ్లి అయిన కొద్దిసేపటికే యువకుడు ఆస్పత్రి నుంచి పారిపోయాడు. దీంతో పోలీసులు యువకుడి కోసం వెతుకుతున్నారు.