Nagula Chavithi : నాగుల చవితి రోజు.. అసలైన సర్పాలకు పూజలు
నాగుల చవితి పర్వదినం రోజు నిజమైన పాములకు పూజలు చేశాడు కర్ణాటకకు చెందిన గోవర్ధన్.. గత కొన్నేళ్లుగా తాను నిజమైన పాములకు పూజలు చేస్తున్నాని తెలిపాడు. కాగా గోవర్ధన్ గత 30 ఏళ్లుగా పాములను పట్టుకొని అడవుల్లో వదిలేస్తున్నారు. ఇప్పటివరకు వెయ్యికి పైగా పాములను రక్షించారు.

Nagula Chavithi
Nagula Chavithi : నాగుల చవితి.. నాగ పంచమి పర్వదినాల్లో చాలామంది భక్తులు పుట్టల్లో పాలు పోస్తుంటారు. మహిళలు ఉదయాన్నే లేచి స్నానాలు ఆచరించి… పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. కొందరు పుట్టకు నీరు పోస్తారు. అక్కడ ఉండే నాగదేవత విగ్రహాలకు పూజ చేస్తారు. మొక్కులు చెల్లించుకుంటారు.. అయితే కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి మాత్రం నాగుల చవితి రోజు ఏకంగా పాములకే పూజ చేస్తాడు.
బుసకొట్టే నాగు పాములను తీసుకొచ్చి పూజలో కూర్చోబెడతారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లా కాపు పతనానికి చెందిన గోవర్ధన్ భట్ అనే వ్యక్తి గత 30 ఏళ్లుగా పాములు పడుతున్నాడు. ఇప్పటి వరకు వెయ్యికి పైగా పాములను రక్షించి అడవుల్లో వదిలేశాడు.
పాములంటే భయంలేని గోవర్ధన్ ప్రతి నాగుల చవితికి రెండు పాములను తీసుకొచ్చి పూజ చేస్తాడు. వాటికి మంగళహారతి ఇచ్చి మంత్రాలు జపిస్తాడు. పాములంటే భయం లేదని అందుకే తానూ నిజమైన పాములకు పూజ చేస్తున్నానని చెబుతూ ఆనందం వ్యక్తం చేశారు గోవర్ధన్. కాగా గోవర్ధన్ పాములకు పూజ చేస్తుండగా అక్కడివారు ఆసక్తిగా చూశారు.