Manipur: ఆ రాక్షసుల కోసం వేట.. వీడియోను పరిశీలించి మరో 14 మందిని గుర్తించిన పోలీసులు
ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. తాజాగా..

Manipur
Manipur horror – Meitei: మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లా (Kangpokpi district) ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన రాక్షసుల వేట కొనసాగుతోంది. ఆ గుంపులోని మరో 14 మంది నిందితులను గుర్తించామని పోలీసులు వివరించారు. ఇటీవల ఇద్దరు కుకీ (Kuki) తెగకు చెందిన ఇద్దరు మహిళలను హింసించి, నగ్నంగా ఊరేగించిన వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
దీంతో నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. తాజాగా వీడియోను పరిశీలించి గుర్తించిన 14 మందిని త్వరలోనే అరెస్టు చేస్తామని సైకుల్ పోలీసులు తెలిపారు. కాగా, మణిపూర్ లో మే 3 నుంచి చెలరేగిన హింస వల్ల మొత్తం 160 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా, మెయితీ తెగకు చెందిన వారిపై దాడులు జరగొచ్చని ప్రచారం జరుగుతున్న వేళ చాలా మంది మణిపూర్ వదిలి అసోం వెళ్తున్నారు. మే 3 నుంచి ఇప్పటివరకు వేలాది మంది అసోంకు వెళ్లారు. మణిపూర్, అసోంలో మెయితీ తెగవారికి పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.
Manipur : నా కుటుంబం భవిష్యత్తు తెలియడం లేదు.. మొదటిసారి మీడియా ముందుకు మణిపూర్ బాధితురాలి తల్లి