Earthquake In Assam : అసోంలో భారీ భూకంపం

అసోంలోని గౌహతితో పాటు పలు ఈశాన్య ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఉదయం 7:55 నిమిషాలకు భూమి కంపించింది.

Earthquake In Assam : అసోంలో భారీ భూకంపం

Earthquake In Assam

Massive earthquake in Assam : అసోంలోని గౌహతితో పాటు పలు ఈశాన్య ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఉదయం 7:55 నిమిషాలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదయ్యింది.



అసోంలోని సోనిత్‌పూర్‌లో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఈ సమయంలో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూ ప్రకంపననలు బెంగాల్‌లోనూ కనిపించాయి.



భూకంపం కారణంగా గౌహతిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రెండుసార్లు భూ ప్రకంపనలు నమోదయినట్లు తెలుస్తోంది.