Fire in Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన వందకుపైగా వాహనాలు..

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో 10 కార్లతో పాటు ఇతర వాహనాలు మరో 50 వరకు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు భయబ్రాంతులకు గురయ్యారు.

Fire in Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన వందకుపైగా వాహనాలు..

Delhi

Updated On : June 8, 2022 / 2:11 PM IST

Fire in Delhi: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో 10 కార్లతో పాటు ఇతర వాహనాలు మరో 50 వరకు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు భయబ్రాంతులకు గురయ్యారు. ఢిల్లీలోని జామియా నగర్‌ ఎలక్ట్రిక్ మోటార్ పార్కింగ్ వద్ద ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడటంతో వందలాది వాహనాలు దగ్దమయ్యాయి. అగ్నిప్రమాదం గురించి ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది.. 11 అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలికి చేరుకున్నాయి. మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించలేదు.

Delhi (1)

అ అగ్ని ప్రమాదంలో మొత్తం 10 కార్లు, ఒక మోటార్‌సైకిల్, రెండు స్కూటీలు, 30 కొత్త ఈ-రిక్షాలు, 50 పాత ఈ-రిక్షాలు అగ్నికి బూడిదయినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇక భారత్‌లో ఇటీవల ఎలక్ట్రిక్‌ వాహనాల పేలుళ్లు అధికమయ్యాయి. ఈవీ ప్రమాదాల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న నాసిక్‌లోని రవాణా కంటైనర్‌లో జితేంద్ర ఎలక్ట్రిక్ వాహనాలకు చెందిన నలభై ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి.

Delhi (3)

కాగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మార్చి నుంచి ఏప్రిల్‌ మధ్య ఎనిమిది ఈవీ ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఎలక్ట్రిక్ వాహనం పెరగడం వల్లనే ప్రమాదం జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Delhi (4)