Sonam Family: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు.. 16లక్షల విలువైన పెళ్లి ఆభరణాలు.. వెనక్కి ఇచ్చేసిన సోనమ్ కుటుంబం..
తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనమ్ కుటుంబం 16 లక్షల విలువైన పెళ్లి ఆభరణాలను..

Sonam Family: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయ తీసుకెళ్లి కిరాయి హంతకులతో చంపించింది భార్య. ఈ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భర్తను చంపేందుకు భార్య వేసిన స్కెచ్ ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. ఈ కేసులో పోలీసుల దర్యాఫ్తు కొనసాగుతోంది.
తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనమ్ కుటుంబం 16 లక్షల విలువైన పెళ్లి ఆభరణాలను.. మృతుడు రాజా రఘువంశీ కుటుంబానికి తిరిగి ఇచ్చేసింది. పెళ్లి సమయంలో రాజా రఘువంశీ కుటుంబం.. పెళ్లి కానుకుగా 16 లక్షల విలువైన ఆభరణాలను సోనమ్ కు ఇచ్చింది. ఆ ఆభవరణాలను ఇప్పుడు సోనమ్ సోదరుడు గోవింద్.. రాజా రఘువంశీ కుటుంబానికి తిరిగి ఇచ్చేశాడు. అందులో గోల్డ్ రింగ్, గాజులు, నెక్లస్ ఉన్నాయి. హనీమూన్ కి వెళ్లే ముందు.. సోనమ్ ఈ ఆభరణాలను ఇంట్లోనే వదిలేసి వెళ్లింది. సోనమ్ మంగళసూత్రం, వెడ్డింగ్ రింగ్ పోలీసుల దగ్గర ఉన్నాయి.
Also Read: విడాకులు వచ్చాయని భర్త సంబరాలు.. 40 లీటర్ల పాలతో స్నానం.. స్వాతంత్ర్యం వచ్చిందంటూ ఫుల్ హ్యాపీ..
పెళ్లి వేడుకలో ఇచ్చిన ఆభరణాలను ఇండోర్ లోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ద్వారా రాజా కుటుంబసభ్యులకు తిరిగి ఇచ్చేశాడు సోనమ్ సోదరుడు. వాటిని ఎవరు ఇచ్చారో వారికి తిరిగి ఇచ్చేయడమే న్యాయం అని గోవింద్ ఈ సందర్భంగా అన్నాడు. తన కుటుంబానికి వాటిపై ఎలాంటి హక్కు లేదని అతడు స్పష్టం చేశాడు. అంతేకాదు.. వివాహ సమయంలో రాజాకు ఇచ్చిన బహుమతులు లేదా డబ్బును తిరిగి తీసుకోవడానికి సోనమ్ కుటుంబం నిరాకరించింది.
రాజా రఘువంశీ, సోనమ్ లు మే 11న పెళ్లి చేసుకున్నారు. హనీమూన్ పేరుతో సోనమ్ రాజాను మేఘాలయ తీసుకెళ్లింది. అలా హనీమూన్ వెళ్లిన రాజా.. మే 23న అదృశ్యం అయ్యాడు. జూన్ 2న రాజా మృతదేహం కనిపించింది. ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలో లోయలో రాజా డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. రాజా కుశ్వాహా అనే వ్యక్తితో కలిసి తన భర్త హత్యకు సోనమ్ కుట్ర చేసిందని పోలీసులు ఆరోపించారు. భర్తను హత్య చేయించేందుకు ఆమె ముగ్గురు కిరాయి హంతకులతో డీల్ చేసుకుందన్నారు. వారంతా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
ఇక ఈ కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్ లభించింది. లోకేంద్ర తోమర్, సెక్యూరిటీ గార్డు బల్బీర్ అహిర్ బర్ లకు బెయిల్ మంజూరు చేశారు మేజిస్ట్రేట్. వారి జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో షరతులతో కూడిన బెయిల్ లభించింది. మేఘాలయ నుంచి పారిపోయిన తర్వాత ఇండోర్ లోని ఓ ప్లాట్ లో సోనమ్ తలదాచుకుంది. ఆ ప్లాట్ ఓనరే లోకేంద్ర తోమర్.