పండగ సీజన్.. టికెట్ ఛార్జీలపై మెట్రో రాయితీలు ఇవే..

Metro Discounts on Ticket Charges : పండగ సీజన్ వచ్చేసింది.. పండగల సందర్భంగా మెట్రో టికెట్ ఛార్జీలపై రాయితీలు ప్రకటించేసింది. రేపటి (శనివారం) నుంచి వచ్చే సంక్రాంతి వరకు మెట్రోలో రాయితీలను వర్తింప చేస్తోంది.
మెట్రో సువర్ణ ఆఫర్స్ పేరుతో మెట్రో ఈ రాయితీలను ప్రకటిస్తోంది. మెట్రో ప్రయాణాల్లో 40 రాయితీలతో టికెట్లపై ఆఫర్లు అందిస్తోంది. స్మార్ట్ కార్డు ద్వారా 7 ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే 30 రోజుల్లో 10 ట్రిప్పులు, 14 ట్రిప్పుల చార్జీతో 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం కల్పిస్తోంది.
20 ట్రిప్పుల చార్జీతో 45 రోజుల్లో 30 ట్రిప్పులు, 40 ట్రిప్పుల చార్జీతో 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం కల్పిస్తోంది. టీ సవారీ మొబైల్ యాప్ ద్వారా నవంబర్ 1 నుంచి ఆఫర్లు వర్తించనున్నాయి.