జైట్లీని గుర్తు చేసుకున్న మోడీ..ఘనంగా నివాళులు

తన తోటి మంత్రి, చిరకాల ఫ్రెండ్ అరుణ్ జైట్లీని గత సంవత్సరం ఇదే రోజున కోల్పోయాను..జైట్లీ దేశానికి చాలా సేవ చేశారని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. నేడు జైట్లీ వర్ధంతి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
ఆయన తెలివి, చతురత, వ్యక్తిత్వం చాలా గొప్పవి అని కొనియడారు. గత సంవత్సరం జైట్లీ సంతాప సభలో తాను చేసిన ప్రసంగాన్ని మోడీ జత చేసి ట్వీట్ చేశారు.
బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ గత సంవత్సరం ఆగష్టు 24, 2019న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు.
బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ గత సంవత్సరం ఆగష్టు 24, 2019న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొద్ది రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9వ తేదీన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయన్ను ఎయిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
1952, నవంబర్ 28న ఢిల్లీలో జన్మించారు. ఈయన తండ్రి ప్రముఖ న్యాయవాది. ఢిల్లీ నుంచి డిగ్రీ, న్యాయశాస్త్ర పట్టా పొందారు. ఢిల్లీ విశ్వ విద్యాలయంలో అభ్యసిస్తున్న సమయంలో విద్యార్థి సంఘం నాయకుడిగా కొనసాగారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉన్న ఈయన 19 నెలలు జైలుకు వెళ్లి వచ్చారు. 1991 నుంచి బీజేపీ కార్యవర్గంలో పని చేశారు.
వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేబినెట్ హోదా మంత్రిగా నియమించారు. మోడీ హాయాంలో ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అనారోగ్యం కారణంగా జైట్లీ ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది మే 14వ తేదీన రెనాల్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది.
2018 ఆగస్టు 23వ తేదీన ఆర్థిక శాఖను ఆయన చేపట్టారు. 2019 మే నెల నుంచి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆర్థిక శాఖను చూస్తున్నారు. మధ్యంతర బడ్జెట్‌ను పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు.