Meghalaya: మేఘాలయలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. మంత్రివర్గ వివరాలు వెల్లడించిన సంగ్మా
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాన్రాడ్ సంగ్మా ఆధ్వర్యంలోని ఎన్పీపీ 26 సీట్లు గెలిచింది. యూడీపీ 11 సీట్లు, బీజేపీ, హెచ్ఎస్‌పీడీపీ, పీడీఎఫ్, ఐఎన్‌డీ పార్టీలు తలో రెండు సీట్లు గెలిచాయి. ఈ పార్టీలన్నీ కలిసి ‘మేఘాలయ డెమొక్రటిక్ అలయెన్స్-2 (ఎండీఏ-2)’ పేరుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు కాబోయే ముఖ్యమంత్రి సంగ్మా వెల్లడించారు.

Meghalaya: మేఘాలయలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం అక్కడి అసెంబ్లీలో జరిగింది. తిమోతి డి షిరా ప్రొటెం స్పీకర్‌గా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం అసెంబ్లీలో 60 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 59 స్థానాలకు ఎన్నిక జరిగింది.
Bihar: బిహార్ మాజీ సీఎం రబ్రీదేవి ఇంట్లో సీబీఐ సోదాలు.. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో విచారణ
ఒక స్థానం ఖాళీగా ఉంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాన్రాడ్ సంగ్మా ఆధ్వర్యంలోని ఎన్పీపీ 26 సీట్లు గెలిచింది. యూడీపీ 11 సీట్లు, బీజేపీ, హెచ్ఎస్‌పీడీపీ, పీడీఎఫ్, ఐఎన్‌డీ పార్టీలు తలో రెండు సీట్లు గెలిచాయి. ఈ పార్టీలన్నీ కలిసి ‘మేఘాలయ డెమొక్రటిక్ అలయెన్స్-2 (ఎండీఏ-2)’ పేరుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు కాబోయే ముఖ్యమంత్రి సంగ్మా వెల్లడించారు. ఆయన పదవీ స్వీకార కార్యక్రమం మంగళవారం షిల్లాంగ్‌లో జరగబోతుంది. దీనికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా సహా పలువురు నేతలు హాజరవుతున్నారు.
Manish Sisodia: మనీశ్ సిసోడియాకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. తిహార్ జైలుకు తరలింపు
కొత్త సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో మంత్రివర్గ స్థానాల్ని కూడా సంగ్మా ఖరారు చేశారు. అసెంబ్లీలో మొత్తం 12 మంత్రి వర్గ స్థానాలకు అవకాశం ఉండగా, అందులో బీజేపీకి 2, యూడీపీకి 1, హెచ్ఎస్‌పీడీపీకి 1 ఇవ్వనుండగా, మిగిలిన 8 స్థానాలను సంగ్మా ఆధ్వర్యంలోని ఎన్పీపీ తీసుకోబోతుంది. ఎండీఏ-2కు ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా కొనసాగుతారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ప్రతిపక్షంలో ఉంటాయి. అయితే, అన్ని పార్టీలూ తనకు మద్దతు ఇచ్చాయని సంగ్మా తెలిపారు. దీంతో ప్రతిపక్షమే లేని ప్రభుత్వంగా తాము పాలన సాగిస్తామన్నారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అన్ని పార్టీలు కలిసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.