MMDR Amendment Bill: ఖనిజ రంగంలో భారీ మార్పులు.. MMDR సవరణ 2026 బిల్లుకు పార్లమెంట్ ఆమోదం.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన గనులు, ఖనిజాల సవరణ బిల్లు(MMDR Amendment Bill), 2026 దేశ ఖనిజ రంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోంది.
Mmdr amendment bill 2026 passed in parliament
- మైనింగ్ పన్నుల్లో పారదర్శకత, స్థిరత్వం
- 35 ఏళ్ల వివాదానికి తెరదించిన తీర్పు
- ఖనిజ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం
MMDR Amendment Bill: భారతదేశ ఆర్థిక భద్రతకు, పారిశ్రామిక అభివృద్ధికి ఖనిజ రంగా సాధికారత అనేది అత్యంత కీలకమైనది. మౌలిక వసతులు, ఉక్కు, రక్షణ రంగం, విద్యుత్ వాహనాలు (EVs), పునరుత్పాదక ఇంధన రంగానికి కావలసిన లిథియం, కొబాల్ట్ వంటి అత్యవసర ఖనిజాల కోసం ఇతర దేశాలపై ఆధారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన సంస్కరణలను చేపట్టింది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన గనులు, ఖనిజాల (MMDR Amendment Bill) సవరణ బిల్లు, 2026 దేశ ఖనిజ రంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోంది.
ఖనిజ పన్నుల వివాదం, న్యాయస్థాన తీర్పులు:
గత 35 ఏళ్లుగా కేంద్ర-రాష్ట్రాల మధ్య ఖనిజ పన్నులపై న్యాయపోరాటాలు సాగాయి. 1989లో సుప్రీంకోర్టు ‘రాయల్టీ అనేది పన్ను’ అని తీర్పు ఇవ్వగా, 2004లో దాన్ని సవరించి రాయల్టీ ఒప్పంద చెల్లింపు అని తెలిపింది. అనంతరం 2024లో ‘మినరల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ’ కేసులో రాయల్టీ పన్ను కాదని, రాష్ట్రాలకు భూమిపై పన్నులు విధించే రాజ్యాంగ హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనివల్ల 2004 నుండి బకాయిల పేరిట మైనింగ్ కంపెనీలపై వేల కోట్ల అదనపు భారం పడే పరిస్థితి ఏర్పడింది.
ఎంఎండీఆర్ సవరణ 2026 ప్రాముఖ్యత:
2026 సంస్కరణల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు విధించే అదనపు పన్నులు, సెస్సులపై స్పష్టమైన పరిమితులను నిర్దేశించింది. మైనింగ్ సంస్థలకు పన్నుల పరంగా పారదర్శకత, స్థిరత్వం కల్పించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. పాత బకాయిల విధింపునకు చెక్ పెడుతూ అసందిగ్ధతకు తెరదించింది. అయితే రాయల్టీలు, వేలం ద్వారా వచ్చే రాబడిపై రాష్ట్రాలకు ఉండే ప్రాథమిక హక్కుల్లో ఎలాంటి మార్పూ లేదు.
DK Shivakumar: ‘వందేమాతరం’ రెండు చరణాలే పాడతాం.. డీకే శివకుమార్ సంచలన ప్రకటన
ఆర్థిక స్వయం సమృద్ధి, భావి ప్రణాళిక:
2015 నుండి సాగుతున్న సంస్కరణల శ్రేణిలో భాగంగా 2023, 2025, ప్రస్తుత 2026 చట్ట సవరణలు వేగవంతమైన వేలం ప్రక్రియను, అన్వేషణను ప్రోత్సహిస్తున్నాయి. బొగ్గు రంగంలో ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్ల వినియోగం వంటి మార్పులు మైనింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాల సాధనలో భాగంగా విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించి, దేశీయ ఉత్పత్తి పెంచడమే ఈ సంస్కరణ ప్రాథమిక లక్ష్యం.
