20మంది పిల్లలకు వడ్డించి.. తినిపించిన మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎంత సున్నిత మనస్సులో అందరికీ తెలిసిందే. పార్టీ బహిరంగ సమావేశాల్లోనే భావోద్వేగానికి గురై కన్నీరు కార్చిన సందర్భాలు కోకొల్లలు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న బృందావన్ చంద్రోదయ మందిర్ క్యాంపస్‌లోని అక్షయ పాత్ర ఫౌండేషన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఫౌండేషన్‌లో ఇప్పటి వరకూ పెట్టిన భోజనాలు లెక్క ప్రకారం.. 2019 ఫిబ్రవరి 11 సోమవారం మధ్యాహ్నం జరిగిన భోజనం మూడో బిలియన్త్ పూట సందర్భంగా ఆయన బృందావన్‌కు సోమవారం అధికారికంగా పర్యటించారు.
మోడీ.. అక్కడి చిన్నారులపై ఆప్యాయత కురిపించారు. స్వయంగా సుమారు ఓ 20 మంది విద్యార్థులకు భోజనం వడ్డించిన మోడీ.. స్వహస్తాలతో తానే అన్నం తినిపించారు. అక్షయపాత్రలో మూడో బిలియన్త్ మీల్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్సిష్‌నెస్ వారు నిధులు సమకూర్చారు. అక్షయ పాత్ర అనేది ఓ బెంగళూరుకు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ ప్రభుత్వంతో కలిసి మధ్యాహ్న ఉచిత భోజన సదుపాయాలను విద్యార్థులకు కల్పిస్తుంది. కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరై మోడీతో పాటు చిన్నారులకు అన్నపానీయాలు అందజేశారు.